డబ్బు మీద ఆశ అందరికీ ఉంటుంది.. చాలా మందికి ఆ పిచ్చి ఉంటుంది.. ఇక డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మోసాలు , దోపిడీలు చేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు వెరైటీ దొంగతనాలు చేస్తున్నారు. అదేంటంటే కొందరు ప్రభుత్వం అధికారులు అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇకపోతే ఇప్పుడు మాత్రం ఓ ఇద్దరు బిరియాని మీద మోజుతో ఫుడ్ వెరిఫికేషన్ ఆఫీసర్లు అంటూ ఓ రెస్టారెంట్ లోకి వెళ్ళారు.. రోజూ బిరియాని తెచ్చుకున్నారు.చివరికి అనుమానం రావడంతో నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది..



ఈ వింత ఘటన అనంతపురం లో చోటు చేసుకుంది..అనంతపురం రూరల్ పరిధిలోని నర్సినాయనికుంటకు చెందిన వెంకటేష్ నాయక్ ఎస్టీ కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. బిర్యానీపై మక్కువతో అతని స్నేహితుడు రామాంజి నాయక్‌తో కలసి కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఫ్రీగా బిర్యానీ కొట్టేయాలన్న దుర్బుద్ధితో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అవతారమెత్తాడు. దానికి అతని ఫ్రెండ్ కూడా సపోర్ట్ కూడా చేయడంతో ఈ కథ ఇంకాస్త ఆసక్తికరంగా మారింది. క్లాక్ టవర్ సెంటర్‌లోని హైదరాబాద్ బిర్యాని హౌస్‌కెళ్లి ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అని చెప్పి ఏడు బిర్యానీ ప్యాకెట్లు తీసుకెళ్లాడు.



అలాగే రోజు హోటల్ కు వెళ్లి బిర్యాని తీసుకెళ్ళాడు ..నిన్న కూడా అదే విధంగా బిరియాని తెచ్చుకోవాలని అనుకున్నాడు..ప్రతిసారీ ఇక్కడికే ఎందుకు వస్తున్నారని అనుమానం వచ్చిన హోటల్ ఓనర్ ఖలీల్ బాషా డ్రైవర్‌లా వచ్చిన  ఫ్రెండ్ ను పట్టుకొని నాలుగు తగిలించారు.ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌నే అడుగుతావా అంటూ అతను చిందులు తొక్కడంతో వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని తన స్టయిల్లో విచారణ జరిపారు.ఇద్దరు ఒరిజినల్ ఆఫీసర్లు కాదని తెలుసుకోవడం తో పాటుగా వారిని అరెస్ట్ చేశారు. ఇలా ఎవరైనా వస్తె వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు..ఈ ఘటన ప్రస్తుతం అనంతపురంలో చర్చనీయాంశంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: