గ్రేటర్ ఎన్నికలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది . ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల తో పాటు, ఎన్నారైలు ఈ గ్రేటర్ ఎన్నికల ప్రచారం పైనా, పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలపైన తీవ్రమైన టెన్షన్ తో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ హోరాహోరీగా జరిగిన ప్రచారాలు పార్టీల మధ్య ఏర్పడిన విభేదాలు, విమర్శలు ప్రతి విమర్శలు, ప్రతి విమర్శలు, సెంటిమెంటు పార్టీ గెలుపు ఓటములు ఊహాగానాలు ఇలా అన్ని అంశాల పైన ఎన్ఆర్ఐలు ఎంతో ఆసక్తిగా ఉండడమే కాక, తమ బంధుమిత్రులకు ఫోన్లు చేసి అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ సోషల్, వెబ్ , మెయిన్ స్ట్రీమ్ మీడియా , ఇలా అన్ని రకాలుగానూ వివరాలు తెలుసుకుంటూ,  ఆసక్తి కనబరుస్తూ ఉండడం మరింత ఆసక్తి రేపుతోంది. 




గ్రేటర్ లో ఏ ఏ డివిజన్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది వాకబు చేస్తూ, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ వాసులు ఎక్కువమంది అమెరికా, కెనడా, బ్రిటన్ తోపాటు గల్ఫ్ దేశాలలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ గ్రేటర్ పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ అయినట్టు గా కనిపిస్తోంది. దీనికి తోడు రాజకీయ పార్టీల మధ్య ఒప్పందాలు, పొత్తులు, ఎత్తులు ఇలా ఎన్నో అంశాలు గ్రేటర్ ఎన్నికల్లో ప్రభావం చూపించబోతున్నాయి. 



గ్రేటర్ లో ఎవరు విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ పార్టీకి రానున్న రోజుల్లో ప్రజలు పట్టం కడతారనే అభిప్రాయం సెంటిమెంట్ గా వస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ఈ అంశంపై తీవ్రంగా దృష్టి సారించాయి. అందుకే  ఎన్నికల ప్రచారం లో అన్ని పార్టీలు స్టార్ ఇమేజ్ ఉన్న  నాయకులందరినీ రంగంలోకి దింపి ఎన్నికల ప్రచారం చేయించాయి. ఈ వ్యవహారాలు అన్నీ, ఎన్ఆర్ఐలకు బాగా ఆసక్తి కలిగిస్తున్నట్టు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: