దుబ్బాక లో గెలిచిన ఉత్సాహం ఇప్పుడు బీజేపీ లోస్పష్టంగా కనిపిస్తుంది. టీ ఆర్ ఎస్ పార్టీ పై ఉన్న వ్యతిరేకత ను పూర్తి గా వినియోగించుకుని దుబ్బాక లో స్వల్ప తేడాతో విజయ భేరి మోగించింది. అయితే అదే ఉత్సాహాన్ని గ్రేటర్ లోనూ కనపరుస్తూ ఇక్కడ కూడా గెలు గుర్రం ఎక్కే ప్రయత్నాలు చేస్తుంది.. హైదరాబాద్ లో పలు పరిస్థితుల వల్ల టీ ఆర్ ఎస్ పై వ్యతిరేకత ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది..  నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ కి బలం కాదు కదా అండగా నిలిచే వారు కూడా ఎవరు లేరు.. అలాంటిది సడ్డెన్ గా పార్టీ బలపడడం దగ్గరినుంచి గెలిచేవరకు పుంజుకుంది అంటే ఖచ్చితంగా  అది బీజేపీ నేతల కష్టం అని చెప్పాలి..

వారి కష్టమే దుబ్బాక లో గెలిచేలా చేసింది, గ్రేటర్ లో గెలిచేలా చేస్తుందని తప్పకుండా చెప్పొచ్చు. గ్రేటర్ లో బీజేపీ గెలుపు దాదాపు ఖాయమని జన సందోహం చూస్తే తెలుస్తుంది. అయితే దీన్ని తెరాస నేతలు వేరేలా చెప్తున్నారు.. గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే ఏమవుద్దో జోస్యం చెప్తున్నారు.. ఇప్పుడు ఉన్న ప్రశాంత వాతావరణం ఉండదని చెపుతున్నారు.  ప్రతిరోజు గ్రేటర్ పరిధిలో గొడవల్లవటం తప్ప ఇక్కడ పార్టీ చేసేదేం ఉండదని చెపుతున్నారు.

మొన్నటి దుబ్బాక ఉపఎన్నికలో గెలిచిన దగ్గర నుండి బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంతగా రెచ్చిపోతున్నారనే విషయాన్ని అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు చూస్తే అర్ధమైపోతోంది. సరే గెలుపోటములను పక్కన పెట్టేస్తే ఒకవేళ కమలం పార్టీ గెలిస్తే మాత్రం ప్రతిరోజు గొడవలే గొడవలు. ఎందుకంటే గ్రేటర్ లో గెలిచినంత మాత్రాన రాష్ట్రప్రభుత్వంపై  పట్టుసాధించేది లేదు. గ్రేటర్ ఎన్నికలంటే మినీ తెలంగాణా ఎన్నికలనే అనుకోవాలి. అందుకనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము విజయం సాధించేసినట్లే బీజేపీ నేతలు ఫీలైపోతారు. దాంతో ప్రతిరోజు వివాదాలు జరుగుతునే ఉంటాయి. ఇప్పటికే ప్రచారంలో ఎంఐఎం ను తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: