తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ల ప్రచార పర్వం ముగిసింది. తెలంగాణ లోని దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం తో  ఎదురులేని టీ ఆర్ ఎస్ కు  పెద్ద షాక్ ఇచ్చింది బీజేపీ. గత రెండు అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి గెలుస్తూ వస్తున్నా టీ ఆర్ ఎస్ పార్టీ ని బీజేపీ అలవోకగా నిలువరించింది. కేసీఆర్ కూడా ఈ ఓటమి ని ఊహించలేదని చెప్పాలి. కేసీఆర్ విధానాలపై ప్రజలు వ్యతిరేకతగా ఉండడం తెరాస ఓటమికి కారణం కాగా అందుకే ప్రజలు కేసీఆర్ కి వార్నింగ్ లా దుబ్బాక లో గులాబీ పార్టీ ని ఓడించారని చెప్పొచ్చు..

ఇప్పటికైనా సర్దుకోకపోతే ఆంధ్ర లో టీడీపీ కి పట్టిన గతి పడుతుందని అన్నారు.. అయితే దుబ్బాక మిగిల్చిన ఫలితమే ఏమో కానీ గ్రేటర్ ఎన్నికలను మాత్రం కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబద్ ఎన్నికల్లో ఏ మాత్రం తేలిగ్గా తీసుకోకూడదని.. కేసీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకోసం తగిన ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటున్నారు..ప్రచారాల్లో వాడాల్సిన అన్ని అస్త్రాలను వాడేశారు. ఇక ప్రజల నిర్ణయమే ఉంది..  అయితే గ్రేటర్ లో అన్ని పార్టీ లు ప్రజలకు కాసుల వర్షం కురిపించారని వార్తలు వస్తున్నాయి. నిన్న రాత్రి ఓటర్లకు అన్ని పార్టీలు లు పెద్ద ఎత్తున డబ్బులు పంచారని తెలుస్తుంది. ఇది ప్రతి ఎన్నికల్లో జరిగే తంతే.. ప్రతి పార్టీ ఓటర్లకు డబ్బు ఇచ్చి వారివైపుకు మలుపుకుంటాయి.

ఓటర్లు కూడా ఆ డబ్బు కోసం వేచి చూస్తూ ఉంటారు. ఎవరు ఎక్కువ డబ్బిస్తే వారికే తమ ఓటు అని చెప్తూ రాజకీయ నాయకుల్లా ప్రవర్తిస్తారు. తీరా అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాక ఎవరికీ ఓటేస్తారో కూడా తెలీదు..అసలు వేస్తారో లేదో కూడా తెలీదు.మొదట్లో ఓటుకు వెయ్యి అనుకున్న వారు కాస్తా.. ఇప్పుడు రెండు వేలు వరకు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఏదైనా ప్రాంతంలో టోకుగా ఓట్లు వేస్తామని నమ్మకంగా చెప్పిన పక్షంలో.. వారికి మరింత ఎక్కువ చెల్లించేందుకు సైతం పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న డివిజన్ లలో మరింత ఖర్చు చేసేందుకు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులకు సంకేతాలు వచ్చేసినట్లుగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: