గ్రేటర్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరికొస్తున్న కొద్దీ హైదరాబాద్ లో  రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.. ఇప్పటికే ప్రచారాల జోరు హోరెత్తిస్తుంది. అధికార,ప్రతిపక్ష పార్టీ లు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒకడుగు ముందుకేసి గెలుపు ధీమా ను వ్యక్తం చేస్తుంది.. గ్రేటర్ ఎన్నికల ఇన్ ఛార్జి  కేటీఆర్ 100 స్థానాలపై కన్నేసి అన్ని స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ప్రతిపక్షాలు సైతం ఈ ఎన్నికలో విజయం సాధించేందుకు తమ అస్త్రాలను ఉపయోగిస్తుంది.

బీజేపీ అయితే తమకు అందుబాటులో ఉన్న నేతలందరినీ పిలిపించి ప్రచారం సాగిస్తుంది.. సౌత్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ కి సహాయం చేస్తే మంచిదని ఇతర రాష్ట్రాల నేతలు కూడా వచ్చి తెలంగాణ లో బీజేపీ తరపున ప్రచారం కొనసాగిస్తున్నారు.. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చి ప్రచారం చేసారు. నిన్న అమిత్ షా కూడా రోడ్ షో లో పాల్గొన్నారు.. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ నగరంలో కొంత పుంజుకుందని చెప్పొచ్చు. అంతేకాదు గెలుస్తుంది అన్న ధీమా ప్రజల్లోకి వెళ్ళేలా చేసి ప్రజల్లో దూకుడుగా ఉన్న పార్టీ గా బీజేపీ పేరు తెచ్చుకుంది.

అయితే అందరిని పిలిచినా పవన్ కళ్యాణ్ ను ఎందుకు ప్రచారంలో వాడుకోలేదు ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీ కి సపోర్ట్ ని పలికారు.. ఈ నేపథ్యంలో పవన్ వినియోగించుకోవడంలో బీజేపీ ఎందుకు జాప్యం చేసిందనే అనుమానాలు వస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదట.. పవన్ గనుక ప్రచారంలోకి దిగితే మళ్ళీ సీమాంధ్ర పార్టీల పెత్తనమంటు కేసీయార్ ప్రాంతీయ వాదాన్ని తీసుకొచ్చి బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చిపోతారని భయపడ్డారట. జనాలు కూడా కేసీయార్ మాటలు నమ్మితే తమకు నష్టం జరుగుతుందని అనుకున్నారట. అందుకే వారు పవన్ ని దూరం పెట్టారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: