తెలంగాణాలో గ్రేటరెన్నికల పోలింగ్ తేదీ దగ్గరికొస్తున్న కొద్దీ అన్ని పార్టీ లు ప్రచారాల జోరును పెంచింది. మేనిఫెస్టో ల హామీలతో ఇప్పటికే ప్రజలను ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తున్న పార్టీ లు ఇప్పుడు ప్రచారంలో తుది అంకానికి చేరుకున్నాయని చెప్పొచ్చు.. అందుకు తగ్గట్లే పార్టీ లోని పెద్దలతో ఆయా నేతలు ప్రచారం సాగిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ టీ ఆర్ ఎస్ తరపున భారీ బహిరంగ సభ నిర్వహించగా , బీజేపీ అమిత్ షా ని పిలిపించి ప్రజలను ఆకర్షించే విధంగా ముందుకు వెళ్తుంది..

ఓ వైపు పోలింగ్ తేదీ దగ్గరకొస్తుండడంతో అన్ని పార్టీ తమదే గెలుపు అని తేల్చి చెప్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ దెబ్బకు దుబ్బాక లో ఓటమితో కృంగిపోయిన కేసీఆర్ ఇక్కడ గెలిచి ఆ ఓటమి బాధను తీర్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అయన ఈ ఎన్నికలను  ఏ మాత్రం తేలిగ్గా తీసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఇక్కడ చేయాల్సిన ప్రచారం చేశేశాడు.. అంతా ప్రజలు చేతిలో ఉంది.. అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు అన్ని పార్టీలకు సరిసమానంగా ఓట్లు వేసినా సెటిలరు ఎటువైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీ నే గెలుస్తుందని అంచనా..

ఈ నేపథ్యంలో వారి ఓట్లే కీలకం కానున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో సెటిలర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాస్తవానికి, కేవలం ఆంధ్రప్రదేశ్‌ మూలాలు కలిగిన వారే కాకుండా, మార్వాడీలు, మరాఠీలు, బెంగాలీలు, తమిళులు, కన్నడిగులు, మలయాళీలు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు చెందిన వారు ఇక్క‌డ నివాసం ఉంటున్నారు.  వీరు ఇప్పుడు ఎటువైపు మొగ్గుతారన్నది ఆసక్తి కరంగా ఉంది.. ఈ ఎన్నికల్లో టీడీపీ కూడా పాల్గొంటుంది.. ఈ నేపథ్యంలో టీడీపీ కనుక కొన్ని సీట్లు గెలిస్తే ఈ ఎన్నికల్లో టీడీపీ డెసిషన్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: