ఏపిలో డీలర్లకు ఏపి సర్కార్ తీపి కబురు అందించింది. ఏపిలో ప్రజలకు రేషన్ సరుకులను అందిస్తున్న రేషన్ డీలర్ల ను తొలగిస్తున్నట్లు గతంలో కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. నేరుగా ప్రభుత్వమే ఈ రేషన్ పంపిణీ చేస్తుందని వార్తలు వినిపించాయి. ఈ విషయాల పై ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.రేషన్ డీలర్ల ను తొలగించే ఉద్యేశ్యం తమకు గానీ, తమ ప్రభుత్వానికి లేదని తెలిపింది.ఈ విషయాన్ని స్వయంగా పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆదివారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద ప్రజలు తినే రేషన్‌ బియ్యంలో సమూల మార్పులు తెచ్చామని పేర్కొన్నారు.



గతంలో టీడీపీ ఇచ్చిన రేషన్ సరుకులు కన్నా ఇప్పుడు క్వాలిటీ ఉన్నా నిత్యావసర సరుకులను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 350 కోట్ల భారం పడ్డా నాణ్యమైన బియ్యం ఇస్తున్నామని తెలిపారు. అలాగే కరోనా సమయంలో ప్రజలపై భారం పడకుండా రేషన్ డీలర్లకు రూ. 22 కోట్లు కమీషన్‌ రూపంలో ప్రభుత్వం ఇచ్చిందని వెల్లడించారు. ఉచిత రేషన్‌ రూపంలో డీలర్లు ఇచ్చే కమీషన్‌ రూ. 270 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించిందని వెల్లడించారు.



ఉచితంగా రేషన్ డీలర్లకు ఇస్తున్న కమీషన్ 270 కోట్లను కూడా ప్రభుత్వం భరించిందని మంత్రి నాని పేర్కొన్నారు. త్వరలోనే వారికి రావాల్సిన బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు, వాలంటీ ర్ల వచ్చిన వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్ డీలర్లను తొలగిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. సరుకులను గ్రామ, వార్డు వలంటీర్లే డోర్ డెలివరీ చేస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో రేషన్ డీలర్ల వ్యవస్థపై విమర్శలు , తీవ్ర ఆరోపణలు వచ్చాయి.. ఈ  నేపథ్యంలో రేషన్ డీలర్లను తొలగించడం లేదని మంత్రి కొడాలి నాని మరోసారి తేల్చి చెప్పడంతో డీలర్లకు ఈ విషయం కాస్త ఊరటను ఇస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: