హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు ప్రచారం ఆదివారం పలు చోట్ల ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే..ఇక ఆ అల్లర్లు ఎక్కువ కాకుండా పోలీసులు ఎక్కడిక్కడ భద్రతా చర్యలను పెంచారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల్లో తగు భద్రత  చర్యలను తీసుకుంటున్నారు..  ఈ మేరకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో కమిషనర్‌‌,డీజీపి లతో పాటుగా పోలీసు ఉన్నతాధికారులు రాజేంద్ర నగర్ ఏసీపీ పరిధిలోని అత్తాపూర్‌, రాంబాగ్‌, సులేమాన్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రిపురం, గగన్‌పహాడ్‌ తదితర సమస్యాత్మక ప్రాంతాలలో ఆయన పర్యటించారు. పోలింగ్ బూతుల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.  అప్రమత్తంగా ఉండాలని సూచించారు..


జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు 22 వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో బందోబస్తుకు సంబంధించిన పుస్తకాన్ని సీపీ ఇతర ఉన్నతాధికారులు ఆవిష్కరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో బందోబస్తుకు సంబందించిన అన్ని విషయాల గురించి ఆయన మాట్లాడారు. నగరంలో 89 వార్డుల పరిధిలో 4,979 పోలింగ్‌ స్టేషన్లున్నాయనీ, వాటన్నింటికీ జియో ట్యాగింగ్‌ చేశామన్నారు. గత ఎన్నికల తో పోలిస్తే ఈ ఎన్నికల్లో 817 సెంటర్లు పెరిగాయి. కరోనా కారణంగా ఎన్నికల కమీషన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు..



ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సైబరాబద్‌ సీపీ సజ్జనార్‌ సారధ్యంలో అన్ని ఏర్పాట్లను చేశారు. పోలింగ్‌ సందర్భంగా మతఘర్షణలకు పాల్పడే హిస్టరీ షీటర్లు, రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచారు. సమస్యాత్మక, సున్నిత సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలటరీ దళాలతోపాటు ఉన్నత అధికారుల పర్యవేక్షణలో గస్తీని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు ఎక్కడైనా ఓట్లు కోసం ఇబ్బంది పెట్టినా లేదా భయబ్రాంతులకు గురిచేసిన పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. మరో రెండు రోజుల పాటు ఈ భద్రత చర్యలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కేంద్రాలను  సిసి కెమెరాల నిఘాలో ఉంచినట్లు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: