రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పెర్కోన్నారు. ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు తమ పాత్ర పోషించడం లేదని ఆయన అన్నారు. డబ్బులు పంచి అడ్డ దారిలో గెలిచే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆయన అన్నారు. పోలీస్ అధికారులే డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు ఆయన. డీజీపీ, ఎన్నికల కమిషనర్ ఈ ప్రభుత్వం, ఈ  సీఎం శాశ్వతం అని అనుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉండొచ్చు కానీ కేంద్రం లో మేము ఉన్నామని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

 మైలార్ దేవ్ పల్లి లో మా కార్యకర్తలు 40 లక్షలు పట్టించారు.. అయిన కేసు బుక్ చేయలేదని ఆయన అన్నారు. మన్సూరాబాద్ లో సాక్షాత్తు మంత్రి డబ్బులు పంచారని ఆయన అన్నారు. కార్యకర్తల పై దాడులు చేస్తున్నారన్న ఆయన. దాడికి ప్రతి దాడులకు సిద్ధమని అన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తే డీజీపీ,ఈసీలదే బాధ్యత అని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత దిగజారి వ్యవహరిస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. మహేందర్ రెడ్డి అంటే గౌరవం ఉండేది ఆయన కూడా ఇంత దిగజారి వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఎన్ని చేసినా గ్రేటర్ లో గెలిచేది బీజేపీనేనన్న సంజయ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది ఎందుకు టీఆర్ఎస్ ఎలా గెలవాలి అని సలహాలు ఇవ్వడానికా ? అని ఆయన ప్రశ్నించారు. చర్యకు ప్రతి చర్య కు అవకాశం ఇవ్వకండన్న ఆయన పోలీసులను చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కార్యకర్తలు రోడ్డెక్కితే ఏమవుతుందో చూడండి.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని అన్నారు. పోలీసు అధికారులు ముఖ్యమంత్రి మాటలు పట్టించుకోకండి....రేపు ఇబ్బంది పడేది మీరే అని ఆయన హెచ్చరించారు. సహనాన్ని పిరికితనం గా భావించకండి.. రేపు గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: