గ్రేటర్ ఎన్నికలు రేపు జరగనున్న క్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కీలక హెచ్చరికలు చేశారు. బల్దియా ఎన్నికల కోసం 22 వేల మంది పోలీసులతో అన్ని భద్రతా పరమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. పోలీస్ సిబ్బందికి నాలుగు సార్లు తర్ఫీదు ఇచ్చామన్న ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అందుబాటులో కేంద్ర, రాష్ట్ర బలగాలు ఉన్నాయని నార్మల్, సెన్సిటివ్, హైపర్  సెన్సిటివ్, క్రిటికల్ పొలిగ్ కేంద్రాల వద్ద  సి ఐ స్థాయి అధికారి నేతృత్వం లో భద్రత ఏర్పాటు చేశామని అన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అందుబాటులో ఉంటారని, 293 హైపర్ సెన్సిటివ్ పికెట్ వద్ద భద్రత ఏర్పాటు చేసామని అన్నారు.

క్రిటికల్ హైపర్ సెన్సిటివ్ పోలీస్ కేంద్రాల వద్ద 6 ఆర్మ్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్న ఆయన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 89 వార్డ్ లు ఉన్నాయని  పోలింగ్ స్టేషన్ -  4979 ఉన్నాయని అన్నారు. 2016 తో పోలిస్తే 817 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు అయ్యాయని అన్నారు. నార్మల్  పోలింగ్ స్టేషన్ లు 2146, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు 1517, 167 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అన్నారు. 406 మొబైల్ పార్టీ లతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామన్న ఆయన హైదరాబాద్ లో 29 బోర్డర్ చెక్ పోస్ట్ లు, హైపర్ సెన్సిటివ్ ఏరియా ల్లో 293 పికెట్ లు ఏర్పాటు చేశామని అన్నారు.

ప్రతి పోలింగ్ స్టేషన్ కు జియో ట్యాగింగ్ తో అనుసంధానము  చేశామని సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచామని అన్నారు. ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయముందని, ఓటర్ లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోండని కోరారు.  అందరూ ఎన్నికల గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలన్న ఆయన ఎలక్షన్ ఏజెంట్ కి ప్రత్యేక వాహనం అనుమతి ఉండదని అన్నారు. వార్డు అభ్యర్థి వాహనంలోనే ప్రయాణం చేయాలని పేర్కొన్నారు. అలాగే ఓటర్లను తరలించడం చట్ట విరుద్ధం అని పేర్కొన్న ఆయన అలా చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: