గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో డబ్బు పంపిణీ కలకలం మొదలయ్యింది. నిన్న రాత్రి నగరం అంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతి బారాదరి లో టిఆర్ఎస్ కి నేతలు డబ్బుల పంపిణీ చేస్తున్నారని సమాచారంతో అక్కడికి బిజెపి కార్యకర్తలు చేరుకోవడంతో వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది, పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. బిజెపి నేతలు మాట్లాడుతూ పోలీసులు వారికి తొత్తులుగా మారారని వాపోయారు. అయితే యాకూబ్ రెడ్డి అనే టీఆర్ఎస్  నేత వెంట ఉన్న ఓ వ్యక్తి వద్దా రివాల్వర్ గమనించిన బీజేపీ నేతలు  హడలిపోయారు.

ఇక అంబర్ పేట నియోజకవర్గంలో నల్లకుంట డివిజన్ నరసింహ బస్తి లో  టిఆర్ఎస్ నాయకులు  విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ ఈ విషయం తెలుసుకొని కవరేజ్ కి వెళ్ళిన స్థానిక రిపోర్టర్ సద్దాం మీద దాడికి యత్నించడంతో నల్లకుంట పీఎస్ లో కేసు రిజిస్టర్ అయింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్ నగర్ డివిజన్ లోని హెచ్ఎఫ్ నగర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారు అని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన జాఫర్ హుస్సేన్ అనే వ్యక్తిని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచడంతో ఎస్ఆర్ నగర్  పి ఎస్ కు చేరుకొని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి  రహమత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి భవాని శంకర్ నిరసన తెలిపారు.

గడ్డి అన్నారం డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ వారు డబ్బులు పంచుతూ ఉండగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు బీజేపీ నేతలు. సరూర్ నగర్ డివిజన్ అంబేద్కర్  నగర్  రోడ్ నెంబర్ 1 లో బీజేపీ అభ్యర్థి భర్త ఆకుల అంజన్ ఎలెక్షన్ నిబంధనలు ఉల్లంఘన చేస్తూ డబ్బులు పంపిణీ చేస్తూ  తెరాస శ్రేణులకు పట్టుబడడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక గడ్డిఅన్నారంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనుచరులు ఓటర్లకు మద్యం,డబ్బులు పంచుతూ స్థానికులకు పట్టుబడడంతో పోలీసులకు అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: