గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆ పార్టీ మాత్రం మల్కాజిగిరి పార్లమెంట్ లో కచ్చితంగా కొన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కీలకంగా ఉన్న స్థానాల్లో కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. పార్టీ అగ్రనేతలు ప్రచారం చేయకపోయినా సరే వారికి మాత్రం విజయావకాశాలు చాలా బాగున్నాయి అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఎవరు వెళ్తారు అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీల మధ్యనే పోటీ ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఈ పోటీ ఎంత వరకు ఉంటుంది అనేది తెలియదు. ఇంకా రాజకీయంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాంటి అవకాశాలు కూడా కనపడటం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన వాళ్లు మాత్రం కచ్చితంగా పార్టీ మారిపోయే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు.

దాదాపుగా ఆరుగురు కీలక నేతలు పార్టీ మారవచ్చని అంటున్నారు. ఇప్పటికే అభ్యర్థులతో భారతీయ జనతా పార్టీ  నేతలు చర్చిస్తున్నారు. గెలిస్తే తమకు మద్దతివ్వాలని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది అని హామీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఇచ్చే పదవులు కూడా వాళ్ళు హామీలు ఇస్తున్నారు. మరి ఇది ఎంతవరకు బిజెపికి కలిసి వస్తుంది అనేది చూడాలి. అయితే ఈ పరిస్థితుల్లో చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీలో ఉండడానికి పెద్దగా ఇష్టం లేదని అంటున్నారు. రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణ ఉంటుంది. వచ్చే నెల 4 న ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: