గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని సంక్షేమ కార్యక్రమాలు ఎంత వరకు ముందుకు నడిపిస్తాయి ఏంటి అనేది ఇప్పుడు చెప్పడం కష్టం. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కువగా దృష్టి సారించి మెజారిటీని లక్షల వరకు ఊహించుకుని ముందుకు వెళ్ళింది. అయితే అనూహ్యంగా టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడంతో పార్టీ నేతలకు, ప్రధానంగా సీఎం కేసీఆర్ కు మింగుడుపడటంలేదు. అయితే ఇప్పుడు యువత ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

టిఆర్ఎస్ పార్టీ మీద చాలా వరకు యువతలో నమ్మకం పోయిందని సీఎం కేసీఆర్ చెప్పే సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తం అవుతుంది. దీనివలన టిఆర్ఎస్ పార్టీ విజయావకాశాలు దెబ్బ తినే అవకాశం ఉంది అనే  వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాజకీయంగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో యువతే కీలకం కానున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కూడా టిఆర్ఎస్ పార్టీ విషయంలో నమ్మకం పోయింది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ పరిణామాలు ఆ పార్టీని ఎంతవరకు ముందుకు నడిపిస్తాయి ఏంటి అనేది చూడాలి. అయితే ఇప్పుడు చూస్తే భారతీయ జనతా పార్టీకి యువకులలో ఎక్కువగా నమ్మకం పెరిగింది. కాబట్టి ఆ పార్టీని  కచ్చితంగా వాళ్ళు ఆదరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఐటీ ఉద్యోగులు మాత్రం టిఆర్ఎస్ పార్టీ పై ఆసక్తి చూపించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు ఆ పార్టీకి కలిసి వస్తుందో చూడాలి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మహిళల  ఓట్లు కూడా చాలా కీలకం కానున్నాయి. కాబట్టి మహిళలను టిఆర్ఎస్ పార్టీ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సంక్షేమ కార్యక్రమాల మీద టిఆర్ఎస్ పార్టీ నమ్మకం పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బ పడే అవకాశాలు ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: