గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజులో భాగంగా నేతలు, కార్యకర్తలు గట్టి పోటీని ఇస్తూ ప్రచారంలో పాల్గొన్నారు.దుబ్బాక ఎన్నికల దెబ్బకు టీఆరెఎస్ పార్టీ నేతలు వెనకడుగు వెయ్యకుండా ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి సైతం ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు అండగా నిలిచారు. మంత్రుల విషయం అయితే చెప్పనక్కర్లేదు.. ఎన్నికలకు నామినేషన్ వేసినప్పటి నుంచి నిన్న ప్రచారం ముగిసేవరకు నేతలతో కలిసి రోడ్ షో లు నిర్వహిస్తూ ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం టీఆరెఎస్ ప్రభుత్వం కు భారీ షాక్ తగిలింది.



ప్రచారానికి వచ్చిన నేతలతో ఎదురు దాడికి దిగారు.. రెండు మూడు, రోజుల క్రితం ఓ బామ్మ తెరాస సర్కార్ కు ఓటు వేసే సమస్యే లేదు అంటూ షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరో మహిళ మంత్రికి ఝలక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ కు షాక్ తగిలింది. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా పలు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయంటూ ఓ సీనియర్ సిటిజన్ ఝలక్ ఇచ్చింది. నగరంలోని హిమాయత్ నగర్ డివిజన్ ఎన్నికల ఇన్‌చార్జ్ గా వ్యవహరిస్తున్న మంత్రి గంగుల.. ప్రచారంలో భాగంగా హిమాయత్ నగర్ లో అపార్ట్ మెంట్ వాసులతో సమావేశం నిర్వహించారు.



అన్ని ప్రాంతాల్లో లాగే అక్కడ కూడా ప్రజల అవసరాలను, సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. టీఆరెఎస్ ప్రభుత్వం ఇప్పటికీ వరకు ఏం చేసింది.. ఇకమీదట ఎటువంటి వాటిని ఆశీస్తున్నారు..అని మంత్రి ఒక్కొకరిని అడిగి తెలుసుకున్నారు.. దీంతో అక్కడి వాళ్లంతా కూడా వారి సమస్యలను చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక వృద్ధురాలు మాత్రం మంత్రికి షాక్ ఇచ్చింది..టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీర్చలేదని , పెన్షన్ , హెల్త్ కార్డ్ , నిరుద్యోగ సమస్యలున్నాయని నిలదీసింది. ఆమె మాట్లాడుతుండగానే మంత్రి సమావేశాన్ని నిలిపివేశారు.అని అడిగింది..దీంతో ఒక్కసారిగా షాక్ అయిన మంత్రి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు..ఇలాంటి పరిస్థితులు చాలా ఎదురవ్వడం తో నగర వాసులకు టీఆరెఎస్ గెలుస్తుందని నమ్మకం పోయింది..మరో మూడు రోజులో ఎవరు గెలుస్తారో తెలియనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: