ఎట్టకేలకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ముగిసాయి. ఎన్నికలలో పాల్గొంటున్న అన్ని రాజకీయ పార్టీలు గెలుపుపై ధీమాగానే ఉన్నాయి. దీనికి వారు చేస్తున్న వ్యాఖ్యలే ప్రత్యక్ష సాక్ష్యం. అయితే అసలైన పోటీ మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి మరియు బీజేపీ ల మధ్యనే ఉండనుందని సగటు ఓటరుకు కూడా స్పష్టంగా  తెలుస్తోంది. అయితే ఒకవైపు బీజేపీ ముఖ్య నాయకులందరూ ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు పూర్తి భరోసా ఇచ్చారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లకు తమ అజెండాను బలంగానే వినిపించారు. కొన్ని చోట్ల వీరి తీరు కొంచెం వివాదంగా అనిపించినా, ఎటువంటి గొడవలు జరగలేదు.

మరో వైపు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి మాత్రం బలమైన నాయకుడు లేక సతమవుతున్న తరుణంలో, సీఎం కేసీఆర్ కూడా ముఖ్యమైన పనులతో బిజీ గా ఉన్న సమయంలో అన్నీ తానై...ఒకే ఒక్కడులాగా ముందుండి నడిపించిన నాయకుడు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఒకవేళ కేటీఆర్ గనుక ప్రచార బాధ్యతలు పూర్తిగా తీసుకోనట్లయితే ఈపాటికి పరిస్థితి వేరేలా ఉండేది. అన్ని చోట్ల తానై ప్రతి ఒక్క కార్పొరేటర్ అభ్యర్థిని నేరుగా కలిసి వారికి మద్దతునిస్తూ, ధైర్యం చెబుతూ ప్రచార కార్యక్రమాలను ముగించాడు. చివరి రోజు ఈయన సికింద్రాబాద్ నియోజకవర్గంలోని శాంతి నగర్ లో తన ప్రసంగాన్ని వినిపించారు.

ఈ సందర్భంగా బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. వెళ్లిన ప్రతి ఒక్క చోట కూడా ప్రజలు కేటీఆర్ కు నీరాజనాలు పలికారు. అన్నా మీకు మేమున్నాం అంటూ కేటీఆర్ కే ధైర్యం చెబుతుంటే, ఇంక అంతకన్నా ఓ రాజకీయ నాయకుడు ఏమి కోరుకోగలడు చెప్పండి. ప్రస్తుతానికి ప్రజలు మరియు పార్టీ కార్యకర్తలు తెలంగాణ అధికార పార్టీకి కేటీఆర్ మా అండ మా ఆశ అని వేనోళ్ళ పొగుడుతున్నారు. కేటీఆర్ ప్రశాంతంగా తన ప్రచారాన్ని ముగించారు. మరి ఇక జరగనున్న గ్రేటర్ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో అన్నది మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: