నిన్న జరిగిన చివరి రోజు ప్రచారం లో ఓట్ల కోసం చర్లపల్లి లో తెరాస నేతలు, కార్యకర్తలు  నోట్లు మరియు మద్యం పంచుతుండగా అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు అలాగే గడ్డిఅన్నారం లో కూడా డబ్బులు పంచుతోందని భాజపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరియు బస్తీల్లో ఓట్ల కోసం పేద ప్రజలకు డబ్బులు అలాగే మందు పంపిణీ చేస్తు తెరాస నేతలు పట్టుబడిన వైనం చోటు చేసుకుంటున్నాయని భాజపా నాయకులు పేర్కొన్నారు.


మేడ్చల్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోగా  ఎందుకు అని   ప్రశ్నించిన ఒక కార్యకర్త పై పోలీసులు దాడి చేశారని అలాగే మేడ్చల్ జిల్లా భాజపా అధ్యక్షుడు ని మీద కూడా పోలీసులు దాడి చేశారని బీజేపి నాయకులు పేర్కొన్నారు.మరోవైపు తెరాస కార్యకర్త ఒకరిని అడగగా తాము నార్కట్పల్లి నుంచి వచ్చామని ఒక నేత తమకు డబ్బులు మరియు మద్యం సరఫరా చేయమని చెప్పారని పేర్కొనడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో తెరాస నేతలు, నాయకులు డబ్బులు పంచుతుండగా ప్రతిపక్ష నాయకులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.పోలీసులు కూడా తెరాస వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారని ప్రతిపక్ష నాయకులు చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: