రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ ఉద్రిక్తమవుతున్న నేపథ్యంలో బీజేపీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నరేంద్రసింగ్ తోమర్ భేటీ అయ్యారు.

రైతుల ఆందోళనలు, డిమాండ్లు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు ప్రధాన చట్టాలను వెనక్కి తీసుకుంటే తప్ప ఢిల్లీ వీడేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. పంటలకు కనీస మద్ధతు ధర అమలు చేస్తామని ప్రకటించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ల పరిష్కారం సాధ్యం కాకపోవచ్చనే చర్చ జరిగింది. ఒక వేళ చట్టాలను వెనక్కి తీసుకుంటే ప్రభుత్వం ప్రతిష్ట దిగజారడంతో పాటు మున్ముందు మరిన్ని డిమాండ్లు వచ్చే ప్రమాదముందని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. రైతులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని భావిస్తున్నారు. ఈ విషయమై సాయంత్రం వరకు ఓం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

4 నెలలకు సరిపడా సరకులు తెచ్చుకున్నాం…

కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఢిల్లీ లోనే బైఠాయిస్తామని రైతులు స్పష్టం చేశారు. డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ మహానగరం చుట్టూ ఉన్న ఐదు ప్రధాన రహదారులపై బైఠాయిస్తామని, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అంటున్నారు. నాలుగు నెలలకు సరిపడా నిత్యావసరాలు వెంట తెచ్చుకున్నామని రైతులు పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: