ప్రజా తీర్పు ఎపుడు వినూత్నమే. విలక్షణమే. ప్రజాస్వామ్యానికి అదే ఆసలైన అర్ధం, పరమార్ధం కూడా అదే. ఏక్ దిన్ కా సుల్తాన్ ఓటర్. ఆ ఒక్క రోజు మాత్రం ఆయన మాట చెల్లుతుంది. ప్రభువుగా మన్ననలు  కూడా అందుకుంటాడు. తన సేవకులను ఎన్నుకునే అతి పెద్ద క్రతువుని పూర్తి చేస్తాడు. విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అసలైన ప్రభువు దిగి వస్తున్నాడు. నేతల తల రాతలను మారుస్తున్నాడు. జాతకాలను తిరిగరాయనున్నాడు.

మరి కొద్ది గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇది గతానికి భిన్నం. ఎన్నడూ ఒక కార్పొరేషన్ కోసం ఇంత పెద్ద ఎత్తున కుమ్ములాట లేదు. ఇంత  భారీగా సాగిన సమరం కూడా లేదు, నిజంగా ఇది కురుక్షేత్ర సంగ్రామమే. వారూ వీరూ మోహరించిన  మహా భారత యుద్ధమే. అందుకే ఈసారి ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

పది రోజులుగా నేతలు చెప్పినవి జనాలు విన్నారు. అయిదేళ్ళూఅ తాము అందుకున్న సేవలు అనుభవించిన కష్ట సుఖాలూ కూడా బేరీజు వేసుకుని మరీ తమదైన తీర్పు ఇచ్చేందుకు 80 లక్షల ఓటర్లు సమాయత్తమవుతున్నారు. మొత్తం 150 సీట్లు కలిగిన  గ్రేటర్ హైదరాబాద్ కోటను పాలించే రాజు ఎవరో జనాలు నిర్ణయించబోతున్నారు.

తాము గత పాలన పట్ల సంతృప్టిగా ఉన్నామా లేదా అన్నది తేల్చి చెప్పబోతున్నారు. ఒక మినీ ఇండియాగా ఉన్న గ్రేటర్ ఎన్నికల తీర్పు పట్ల మొత్తం భారత దేశం కూడా ఆసక్తిగా చూస్తోంది. ఢిల్లీ నుంచి నేతాశ్రీలు దిగి రావడంతో జాతీయ మీడియా చూపు కూడా ఇటు వైపే ఉంది. మొత్తానికి ఈసారి ఎలాంటి తీర్పు రాబోతోంది అన్నది ఇంటెరెస్టింగ్ మ్యాటరే మరి.మరో వైపు గ్రేటర్ ఎన్నికల వేళ ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లూ కూడా ఈసారి చేశారు. దాంతో అది కూడా రికార్డు గానే ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: