ఢిల్లీ లో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతూ ఉండడం ఢిల్లీ లో మూడో వేవ్ రావడం తో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ లో ని ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా టెస్టు రేట్ ను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.ఢిల్లీ లో ని ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా టెస్టులను ఉచితం గా చేస్తున్నాం అని అది అలాగే కొనసాగుతుందని కానీ ప్రైవేట్ హాస్పిటల్ లో జరిపే కరోనా టెస్టు రేట్ లను 2400 రూపాయల లోపు  ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ పేర్కొన్నారు. 


RT-PCR టెస్టులు నిర్వహించే ప్రైవేట్ హాస్పిటల్ కేవలం 2400 రూపాయల లోపు టెస్ట్ చేయాలని దీనీవల్ల ప్రైవేట్ హాస్పిటల్ లో టెస్ట్ చేయించుకునే వాళ్లకు ఇది ఉపయోగకరంగ ఉంటుందని చెప్పారు.ఈ నిబంధన ను ఈ రోజే అమలు చేస్తున్నట్లు తెలిపారు.icmr నిర్ణయం ప్రకారం మహారాష్ట్ర,రాజస్థాన్,తమిళనాడు మే నెలలో టెస్టు రేట్ ని తగ్గిoచినప్పటికి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ లు ఈ నిబంధనలు పాటించడం లేదు.సుప్రిo కోర్ట్ పరిశీలన ప్రకారం 400 రూపాయల లోపు టెస్ట్ చేయాలని అభ్యర్థిoచిది.


ఒక టెస్టు చేయడానికి కేవలం 200 రూపాయలు మాత్రమే అవుతుందని చెప్పగా చాల రాష్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతలు వాటి ధరను 900 నుండి 2800 వరకు నిర్ణయించాయి.ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో మొబైల్ వెహికిల్ టెస్ట్ లాబ్ లను ఏర్పాటు చేశారు.దీంతో ఢిల్లీ లో కరోనా టెస్ట్ కెపాసిటీ 60000 నుండి 100000 కు పెరిగిందని చెప్పారు.ఇప్పటివరకు ఢిల్లీ లో 5 లక్షల అరవై వేల కేసులు వచ్చాయని 9066 మంది చనిపోయారని రెండో రోజు ఐదు వేల కేసుల కంటే తక్కువ వచ్చాయని నిన్న ఆదివారం 4096 కేసులు వచ్చాయని 68 మంది చనిపోయారని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: