గ్రేటర్ ఎన్నికల్లో  అన్ని పార్టీలు జోరుగా తమ ప్రచారాన్ని నిర్వహించాయి..ప్రతి రాజకీయ పార్టీ తమ రాజకీయ ప్రముఖులను హైదరాబాద్ కి రప్పించి మరి ప్రచారాన్ని నిర్వహించాయి .. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది.. రేపు ఎన్నికల పోలింగ్ జరగనుంది.. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై పలు వ్యాఖ్యలు చేశారు..

అందులో  భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ  ప్రభుత్వం చెప్పు చేతల్లో  పని చేస్తుందని ఆరోపణలు చేశారు..
అయితే  గ్రేటర్ ఎన్నికల్లో డబ్బుల పంపిణీని  అదుపు చేయడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజాసింగ్ అధికార పార్టీ పై విరుచుకు పడ్డారు .  డబ్బులని పంచుతుంటే  బీజేపీ కార్యకర్తల పై తెరాస నాయకులూ  దాడులు చేశారని ఇలాంటి దాడులు చేయడం అధికార ప్రభుత్వానికి తగదని అన్నారు ..  అలాగే రేపే ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాజాసింగ్  బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.. అంతేకాదు సైదాబాద్  లో  టిఆర్ఎస్ నాయకులు గుండా గిరి చేస్తున్నారని అక్కడి సమీపంలోని ఒక కాలనీ లోకి ఓటింగ్ పై  అవగాహన కల్పించడం కోసం వచ్చిన  బీజేపీ అభ్యర్థిపై  టిఆర్ఎస్ నాయకులు దాడి చేశారని కర్రలతో తల పగల కొట్టారని  టిఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేసారు రాజా సింగ్  .. వారిపై తక్షణమే  కఠిన చర్యలు తీసుకోవాలని అని రాష్ట్ర ఎన్నికల సంఘం పై రాజాసింగ్ ఫిర్యాదు చేశారు..

గ్రేటర్ ఎన్నికల  సమరం  ముగిసింది .. రేపే పోలింగ్ కనుక అధికారులు  పోలింగ్ కి సంబందించి అన్ని ఏర్పాట్లు  చేసారు .. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో కట్టుదిట్ట జాగ్రత్త చర్యలతో పోలింగ్ ని రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది .. ఇప్పటికే పోలింగ్ అధికారులకు అన్ని ఆదేశాలను ఈసీ పంపించింది .. కరోనా నేపథ్యం లో పోలింగ్  సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా ఈసీ తెలిపింది ..  

మరింత సమాచారం తెలుసుకోండి: