ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గాయకుడు బాలసుబ్రహ్మణ్యం మృతికి నివాళులు అర్పించారు. అనంతరం సభ వాడీవేడిగా ప్రారంభమైంది. అమరావతి రైతుల విషయం లో చర్చకు పట్టుపట్టారు. సభలో గందరగోళం నెలకొనడంతో టీడీపీ సభ్యులను ఒకరోజు బహిష్కరించారు. అనంతరం ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్్నబాబు మాట్లాాడుతూజ జగన్పై బురద జల్లడమే చంద్రబాబు పని అని అన్నారు. ఇవాళ ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు అమరావతి రైతులు తప్ప మిగతా రైతులు కనిపించడంలేదని ఎద్దేవా చేశారు.


సీఎం జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేలు నిర్వహిస్తుంటే గాలి సర్వేలంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారన్నారు. గతంలో రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది. చంద్రబాబేనని అన్నారు. డిసెంబరు నెలాఖరు నాటికి వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. వరదల సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకున్నామని, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: