వైసీపీ కి ఇప్పుడు ఏపీ లోఅంత శుభ శకునంగా సాగిపోతుంది.. కరోనా తగ్గిపోతూ ఉండడం, ప్రజలు సంతోషంగా జగన్ పాలన లో ఉండడం చూస్తుంటే జగన్ ముఖ్యమంత్రి గా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు కు సరైన బుద్ధి చెప్పి ప్రజలు జగన్ ఎన్నుకోవడం మంచిదే అయ్యింది.. ఇదిలా ఉంటే రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.. దాని మీద ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో కూడా అందరికి తెలుసు.. అయితే ఈ ఎన్నికలముందు తిరుపతి ఉప ఎన్నిక జరగబోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అయితే స్థానిక ఎన్నికలు వద్దన్నా వైసీపీ పార్టీ ఇప్పుడు ఆ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఎలా ఇచ్చిందా అని ఆలోచిస్తున్నారట రాజకీయ నిపుణులు.. ఈ స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ కి ప్రభుత్వానికి అయిన చర్చ గురించి అందరికి తెలిసిందే.. స్థానికం కోసం ప్రతిప‌క్షాలు ఎదురు చూస్తున్నాయి. అయితే.. క‌రోనా నేప‌థ్యంలో వాయిదా వేసిన ఎన్నిక‌ల‌ను క‌రోనా వెళ్లిపోయే వ‌ర‌కు నిర్వహించ‌వ‌ద్దని.. ప్రభుత్వం కోరుతోంది. అయితే.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌కే మొగ్గు చూపుతోంది.

దీనికి సంబంధించి అవ‌స‌ర‌మైతే.. కోర్టుకు సైతం వెళ్లాల‌ని నిర్ణయించుకుంది. స‌రే… రేపు ఎటు పోయి ఎటొచ్చినా.. త‌మ పంతం వీగిపోయి.. రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌చ్చినా.. త‌మ‌దే పైచేయి కావాల‌నే వ్యూహంతో జ‌గ‌న్ ముందుకు వెళ్లేలా గ్రౌండ్ వ‌ర్క్ చేసేస్తున్నారు. అయితే ఉన్నట్లుండి ఈ ఏర్పాట్లు చేయడానికి  కారణం లేకపోలేదట.. డిసెంబర్‌ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపులకు సంబంధించి లాటరీ పూర్తి కాని చోట్ల త్వరగా పూర్తి చేయాలని కూడా ప్రభుత్వ పెద్దలను ఆదేశించారు.మొత్తంగా చూస్తే.. డిసెంబ‌రు చివ‌రి వారం నుంచి జ‌న‌వ‌రి తొలి వారం మ‌ధ్య వ‌ర‌కు ఈ పంపిణీ పూర్తి చేయాల‌ని నిర్ణయించుకున్నారట జ‌గ‌న్‌.ఒక‌వేళ ఓట్ల కోస‌మే.. ఇప్పుడు ఇళ్లు పంచుతున్నారంటూ.. వారు కామెంట్లు చేస్తే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఏం జ‌రిగిందో.. వైసీపీ నేత‌లు విమ‌ర్శించే అవ‌కాశం ఉంటుంది. అందుకే స్థానిక ఎన్నికలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: