అధికారంలోకి రాకముందు జగన్ ప్రజా సంకల్ప యాత్ర ను ప్రారంభించి ప్రజలకు ఎంత చేరువ అయ్యాడో అందరికి తెలిసిందే. ఆ పాదయాత్ర మూలంగానే జగన్ కి మంచి మైలేజ్ వచ్చింది.. ప్రజల్లో మంచి పేరు వచ్చింది..  ఆ ఫలితంగానే జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఏ పార్టీ గెలవనటువంటి మెజారిటీ తో గెలిచింది వైసీపీ పార్టీ.. గెలిచింది తడవుగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా పనులు మొదలుపెట్టారు జగన్.. అయితే అయన ముఖ్యమంత్రి అయ్యాక తన మంత్రి వర్గ విస్తరణ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు..

పార్టీ కి పనిచేసిన నేతలు ఎక్కువగా ఉండడంతో వారు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో అందరికి పదవులు ఇవ్వలేని కారణంగా రెండున్నర సంవత్సరాలకొకసారి మంత్రి వర్గ విస్తరణ చేస్తానని చెప్పారు. తద్వారా అందరికి అవకాశం ఇవ్వొచ్చునని అసంతృప్తులు కూడా తగ్గే అవకాశం ఉంటుందని అయన భావించారు. దాంతో మరో పదినెలల్లో జగన్ ఎవరిని తప్పించి ఎవరిని చేర్చుతారో అని అందరిలో ఆసక్తి నెలకొంది. జ‌గ‌న్ ముందే చెప్పిన‌ట్టు ఇప్పుడున్న మంత్రుల్లో 90 శాతం మందిని మార్చేసి వారి స్థానాల్లో కొత్తవారికి అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పారు. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచి సిట్టింగ్‌ల్లో టెన్షన్ స్టార్ట్ అయితే.. ఆశావాహుల్లో ఆశ‌లు చిగురిస్తున్నాయి.

కొత్తగా మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్న వారిలో సీనియ‌ర్లు, క్యాస్ట్ ఈక్వేష‌న్లపై ఆశ‌లు పెట్టుకున్న వారు చాలా మందే ఉన్నారు.నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తెల్లం బాల‌రాజు, క్షత్రియ కోటాలో జ‌గ‌న్‌కు న‌మ్మిన‌బంటుగా ఉన్న న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద‌రాజు, భీమ‌వ‌రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్,  బీసీ కోటాలో త‌ణుకు నుంచి రెండోసారి గెలిచిన కారుమూరి నాగేశ్వర‌రావు, గోపాల‌పురం ఎమ్మెల్యే తలారి వెంక‌ట్రావు ఇలా మరికొంత మంది ఆశావహుల లిస్ట్ లో ఉన్నారు.. మరి జగన్ ఎవరికీ ఏ శాఖా అప్పగిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: