రాష్ట్రంలో ఇప్పుడు పరిణామాలు అన్ని వైసీపీ కి అనుకూలంగా మారిపోయాయి..ప్రతిపక్షాలు కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పెట్టాలని చూసినా దాన్ని జగన్ అధిగమించి సుపరిపాలన కొనసాగిస్తున్నారు.. సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఎలా అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు..ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకిచ్చిన మాట తప్పలేదు.. గెలవకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తూ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు.. ఇక ముఖ్యమంత్రి అయ్యాక అయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆయన్ని ఇంత ప్రజాదరణ పొందేలా చేశాయని చెప్పొచ్చు..

ఇక ఇదే సమయంలో చంద్రబాబు రాజకీయ జీవితం రోజు రోజు కి దిగజారిపోతుందని చెప్పొచ్చు.. రాష్ట్రానికి వచ్చే ఆలోచన చెయ్యట్లేదు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే కొరికే కానీ అందుకు తగ్గట్లు లోకేష్ ని తీర్చి దిడ్డట్లేదు.. పార్టీ పై పట్టు రోజు రోజు కు కోల్పోతున్నాడు. నేతలు ఎవరు చంద్రబాబు మాట వినట్లేదు.. ఇలాంటి సమయంలో చదన్రాబాబు తిరిగి పార్టీ ని ఎలా గాడిపెట్టాలో ఆలోచిస్తూనే పుణ్యకాలం గడిపేసేలా ఉన్నాడు. ఈలోపు తిరుపతి ఉప ఎన్నిక అయన పెద్ద సమయంగా మారింది.

అక్కడ తాను ఎంపిక చేసిన అభ్యర్థి మొండికేయడంతో అయన కు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. గత రెండు సార్లు పనబాక లక్ష్మి ఇక్కడ ఓడిపోవడంతో తాను ఈసారి ఎన్నికల ఖర్చు పెట్టడం ఇబ్బంది అవుతుందని చెప్పగా పార్టీనే అన్ని ఖర్చులు భరిస్తుంది. అయితే ఫండింగ్ కూడా అంత ఆశాజనకంగా రావడంలేదు. హజంగా డీకే ఆదికేశవులునాయుడు కుటుంబం టీడీపీకి ఫండింగ్ ఇచ్చేది. అయితే ఇటీవల డీకే సత్యప్రభ మరణంతో ఆ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండదలచుకుంది.మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతలు ఖర్చు కోసం పార్టీవైపు చూస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు సయితం ముఖం చాటేశారట. ఇది టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: