హైదరాబాద్ జిల్లాలో  2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు శాతం కేవలం 48.89 నమోదైంది.అలాగే 2019 లో జరిగిన  హైదరాబాద్ లోకసభ ఎన్నికల్లో కేవలo ఓటు శాతం 44.84 మరియు సికింద్రాబాద్ లో ఓటు శాతం 46.50, మల్కాజిగిరి లోక్ సభ లో ఓటు శాతం 49.63,చేవెళ్ల లోకసభ ఎన్నికల్లో 53.25 శాతం నమోదైంది. నగరంలో ఎక్కువగా నివసించే వారిలో సాఫ్ట్వేర్ మరియు బిసినెస్  చేసే వాళ్ళే ఎక్కువ మరియు ఎక్కువ మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్లే కావున వారు ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు.మరియు పార్టీలు ఎక్కువగా పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతం లో ప్రచారం చేస్తూ వారికి డబ్బు పంచి  గెలిచే ప్రయత్నాలు చేస్తాయి. మరియు చాలా మంది ఉద్యోగస్తులు వీక్ హాఫ్ కావడం మరియు నేడు గురునాణక్ జయంతి కావడం రేపు సెలవు కావడం తో చాలా మంది ఔటింగ్ మరియు టూరిస్టు స్థలాలకు వెళ్లాడమ్ జరిగింది. 


మరియు చాలా మంది నగరం లో ఏ పార్టీ గెలిచినా తమకు ఎటువంటి లాభం ఉండదని ఇంకా కొంతమంది మా ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి చేయరు అని ప్రాంతన్నీ బట్టి  వారి సమస్యలను బట్టి  చాలా మంది ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు మరియు ఉదాహరణకు పాతబస్తీలో ప్రజలు నీటి సరఫరా, రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గ చేయడం లేదని ఎన్ని ఏళ్ళు గడిచిన తమ పరిస్థితి ఇలానే వున్నదని ఇంకొక ప్రాంతంలో బస్సు సౌకర్యం లేదని ఇంకొక ప్రాంతంలో తమకు ఇంటికి రావడానికి కూడా రోడ్ లేదని వారి వారి సమస్యలను బట్టి ఎవరు వచ్చినా ఏమి చేయరు అనే ఆలోచనతో ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ జరిగిన ప్రాంతం మరియు లోక్ సభ ఎన్నికల్లో కూడా అతి తక్కువ పోలింగ్ జరిగిన ప్రాంతంగ హైదరాబాద్ నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: