గ్రేటర్ ఎన్నికలకు సర్వం రంగం సిద్ధమైంది. ఇక ఓటర్ ఇంటి నుంచి బయటకు వచ్చి తన ఓటుని వేయడమే తరువాయి. మొత్తం కోటి మంది దాకా జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో 80 లక్షల మంది ఓటర్లు ఉంటారని అంచనా. ప్రతీ ఒక్క ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం కల్పించింది.

ఇక ఎన్నికలకు సంబంధించి అన్ని రకాలైన ఏర్పాట్లూ పూర్తి చేశాయి. కట్టుదిట్టంగా భద్రతను చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కనీ వినీ ఎరగని రీతిన హైదరాబాద్ ని పోలీసులు మొత్తం మోహరించారు. ఈసారి బస్తీ మే సవాల్ అన్నట్లుగా రాజకీయం నడచిన ప్రభావం కాబోలు మొత్తానికి మొత్తం పోలీసుల కంట్రోల్ లోకి భాగ్యనగరం వెళ్ళిపోయింది.

హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్చగా తమ ఓటును వేసుకునేందుకు గట్టి పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇక అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలను కూడా ఈసారి ఎక్కువగానే గుర్తించారు. 46 వరకూ అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలుగా ఎంపిక చేశారు. మరో 60 నుంచి 70 దాకా సమస్యాత్మకమైన ప్రాంతాలుగా కూడా పోలీస్ వర్గాలు గుర్తించి బందోబస్తుని పెంచారు.

ఈసారి పాతబస్తీ ప్రాంతాల్లోనే అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించడం విశేషం. అంతే కాదు ప్రతీ గల్లీలోనూ పోలీసులు తిరుగుతూ అణువణువూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా హైదరాబాద్ ని మొత్తం జల్లెడ పట్టేశారు. తమ చూపు దాటిపోకుండా పకడ్బంధీ చర్యలు తీసుకున్నారు. నిజానికి ఒక కార్పోరేషన్ ఎన్నికలకు ఇంత పెద్ద ఎత్తున బందోబస్త్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. ఇది ఒక రికార్డ్ అంటున్నారు. ఈసారి ఎన్నికల కోసం దాదాపుగా 15 వేల మంది పోలీసులు విధుల్లో ఉండడం విశేషం. మొత్తం హైదరాబాద్ పోలీసులు తొమ్మిది వేలు ఉంటే వారికి అదనంగా వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను తెప్పించి మరీ గ్రేటర్ లో మోహరించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: