ఏపీలో ఒక పవర్‌ఫుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది సీఎం జగన్ మాత్రమే...తిరుగులేని మెజారిటీతో అధికారంలో జగన్‌కు రాష్ట్రంలో ఏ నాయకుడు లేని విధంగా ప్రజలు మద్ధతు ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక తనకు మద్ధతుగా ఉన్న ప్రజలకు జగన్ తన పాలనలో ఎలాంటి వరాలు అందిస్తున్నారో కూడా తెలిసిందే. గతంలో చంద్రబాబు మాదిరిగా మాటల మనిషి అనిపించుకోకుండా, చేతల మనిషి అనిపించుకుంటున్నారు.

అయితే జగన్ పాలన దృష్టి పెట్టి ఎక్కువసార్లు మీడియా ముందుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. సాధారణంగానే జగన్ మీడియా ముందుకు రావడం చాలా తక్కువ. కాకపోతే ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినప్పుడు జగన్ సచివాలయం నుంచే మీడియాతో మాట్లాడేవారు. ఇక జగన్ మాటలపైన టీడీపీ శ్రేణులు ఏ విధంగా ట్రోల్స్ చేసాయో కూడా తెలిసిందే. జగన్‌కు మీడియా ముందు మాట్లాడటం రాదని ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

టీడీపీ కార్యకర్తలు కావాలని ఎడిటింగ్‌లు చేసి సోషల్ మీడియాలో వదిలేవారు. అయితే జగన్ ఎలన్త్ పవర్‌ఫుల్ స్పీచ్‌లు ఇవ్వగలరో పాదయాత్ర సమయంలో అంతా చూశారు. కానీ సీఎం అయ్యాక టీడీపీ శ్రేణులు వేరే విధంగా ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం చేశారు. ఇక అసెంబ్లీకి వచ్చేసరికి జగన్ సత్తా ఏంటో అంతా చూస్తానే ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన అసెంబ్లీ ద్విపాత్రాభినయం చేస్తున్నారని చెప్పొచ్చు.

ఎందుకంటే ఓ బాధ్యతగల సీఎంగా అసెంబ్లీలో ఎలా ఉండాలో, ప్రజలకు ఏం చేయాలో చక్కగా స్పీచ్‌ల రూపంలో వివరిస్తారు. అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ ఏదైనా విమర్శలు చేస్తే అదే రేంజ్‌లో కౌంటర్లు ఇస్తున్నారు. అధికార పార్టీ అధినాయకుడుగా జగన్ అదరగొడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. అలా చూస్తే సచివాలయంలో మాట్లాడే సీఎం జగనేనా అనేలా ఉంటుంది. అసలు మొత్తానికి చెప్పాలంటే జగన్ ఓ రేంజ్‌లో చంద్రబాబుని ఆట ఆడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: