గ్రేటర్ ఎన్నికలకు మరి కొన్ని గంటలే ఉంది. ఇప్పటికే పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎం‌ఐ‌ఎం, బీజేపీ, టీడీపీతో చిన్నాచితక పార్టీలు గ్రేటర్ బరిలో ఉన్నాయి. అయితే ఇన్ని పార్టీలు ఉండటం వల్ల ఎవరి ఓట్లు ఎలా చీలతాయో అర్ధం కాకుండా ఉంది. ఇక ఈ ఓట్ల చీలిక తమకు ఎలాంటి నష్టం తీసుకురాకూడదని అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు వేసుకుని ముందుకెళ్లింది.

అయితే జనసేన పోటీలో లేకుండా బీజేపీకి మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. గ్రేటర్‌లో పవన్ అభిమానులు బాగానే ఉన్నారు. ఏపీ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన కాపు ఓటర్లు పెద్ద మొత్తంలోనే ఉన్నారు. గత మేయర్ ఎన్నికల్లో వీరు అధికార టీఆర్ఎస్‌కే సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వీక్ కావడంతో బీజేపీ పుంజుకుంది.

ఆ విషయంలో దుబ్బాక ఉపఎన్నికలోనే అర్ధమైంది. పైగా కేంద్రంలో కూడా అధికారంలో ఉండటం బీజేపీకి కలిసొచ్చే అంశం. ఇంకా జనసేన మద్ధతు ప్లస్ అవుతుంది. అయితే జనసేన ఓట్లు బీజీపీకి వెళ్లకుండా కేటీఆర్ ఎత్తుకుపై ఎత్తులు వేస్తూనే ఉన్నారు. పవన్ అభిమానులు చేజారిపోకుండా పదునైన వ్యూహాలతో ఆయన ముందుకెళ్లారు. ఇటీవల ఆయన ఓ టీవీ చానల్‌లో చెప్పిన మాటలని బట్టి చూస్తే, కేటీఆర్ జనసేన ఓట్లని టీఆర్ఎస్ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారని అర్ధమవుతుంది.

ఎన్నికల ప్రచారంలో బీజేపీపై విమర్శలు చేసిన కేటీఆర్, జనసేన గురించి పెద్దగా మాట్లాడలేదు. పైగా పవన్ తనకు మిత్రుడు అని, కాకపోతే రాజకీయాలు వేరని, అలా అని తమ మిత్రుత్వం ఎక్కడికి పోదు అని చెప్పారు. అంటే దీని బట్టి చూసుకుంటే కేటీఆర్..పవన్ అభిమానులని తనవైపుకు తిప్పుకునే భాగంగా ఇలా మాట్లాడారని అర్ధమవుతుంది. మరి చూడాలి ఎన్నికల్లో పవన్ అభిమానులు బీజేపీ వైపు మొగ్గు చూపుతారో, గులాబీ పార్టీకి జై కొడతారో.

మరింత సమాచారం తెలుసుకోండి: