గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. తెరాస సర్కార్ ని ఎదుర్కోవడానికి బిజెపి నేతలు కాస్త గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు తెరాస కూడా కాస్త సీరియస్ గానే ఉంది. తాజాగా పటాన్ చెరు లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ నాయకుల్లో రోజురోజుకు ఫ్రస్టేషన్ పెరుగుతోంది అని మండిపడ్డారు. ఈ రోజు పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు బీజేపీ నాయకుల ధర్నా ఒక డ్రామా అని ఆయన విమర్శలు చేసారు.

 పీఎం మోడీ, అమిత్ షా తో సహా ఢిల్లీ నేతలను తెచ్చి ప్రచారం చేయించిన ఫలితం లేకపోవడం తో వారిలో ఫ్రస్టేషన్  పెరిగిపోతుంది అని హరీష్ రావు అన్నారు. ప్రజలు బీజేపీ నేతలను నమ్మక పోవడం తో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలతో లబ్ది పొందాలని చూస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఫేక్ వార్తల ప్రచారం లో నోబెల్ బహుమతి ఉంటే ఆ బహుమతి బీజేపీకే వస్తుంది అని హరీష్ రావు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ప్రధాన చాన్నాళ్ల లోగో లు వాడుకుని టీఆర్ఎస్ ప్రముఖ నేతలు  బీజేపీ లో చేరుతారని ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం  చేస్తున్నారని మాకు విశ్వసనీయ సమాచారం ఉంది  అని ఆయన వెల్లడించారు.

దయచేసి  ప్రజాలెవ్వరూ అలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దు... ఎవ్వరూ సర్క్యులేట్ చేయవద్దు అని ఆయన సూచించారు. సోషల్ మీడియా ను పూర్తి స్థాయి ఫేక్ మీడియా గా బీజేపీ మార్చింది అని ఆయన విమర్శించారు. బలమైన సోషల్ మీడియా స్థాయిని దిగజార్చింది అని ఆయన మండిపడ్డారు. టీఆరెస్ కార్యకర్తలేవరూ సంయమనం కోల్పోవద్దు అని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: