గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం విఫలం అయింది అంటూ భారతీయ జనతా పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. తాజాగా బిజెపి నేతలు ఆ పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుని లక్ష్యంగా చేసుకుని వారు నేడు ఆరోపణలు చేసారు. డబ్బులు పంచుతున్నా సరే తెరాస పార్టీని ఏమీ చేయడం లేదని వాళ్ళు ఆరోపణలు చేసారు. బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తుతుంది అని ఆయన మండిపడ్డారు. భాజపా బెలూన్ల ఏర్పాటు కు అవకాశం ఇవ్వలేదు కానీ తెరాస సభకు ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో డబ్భు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు అని అన్నారు. అడ్డుకుంటున్న భాజపా కార్యకర్తలపై దాడులు, కేసులు పెడుతున్నారు అని విమర్శించారు. పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి తొత్తులుగా మారారు అని ఆయన మండిపడ్డారు.

ఈ ఎన్నికల్లో భాజపా గెలవబోతుంది అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. రాంచందర్ రావు మాట్లాడుతూ... తెరాస నేతలు డబ్బులు పంపిణీ చేసేది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న, భాజపా ఫిర్యాదు చేసిన ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు అని ఆయన మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడైన గెలవాలని తెరాస చేస్తోంది... భాజపా అడ్డుకుంటుంది అని ఆయన స్పష్టం చేసారు. రఘునందన్ రావు మాట్లాడుతూ... రాజేంద్రనగర్ పరిధిలో తెరాస నాయకులు డబ్బులు పంచుతుంటే పోలీసులు పట్టించుకోలేదు అన్నారు. భాగ్య నగరంలో ఎప్పుడూ పోలింగ్ 50శాతంకు మించి పెరగడం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. దుబ్బాక ప్రాంతంలో 80శాతం పోలింగ్ నమోదు అయింది అన్నారు. శాంతియుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలి అని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: