గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఎన్నికల్లో కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు బిజెపికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే టిఆర్ఎస్ పార్టీ లో గెలిచిన అభ్యర్థుల కోసం భారతీయ జనతా పార్టీ గాలం వేసింది ఎక్కువగా వినబడుతున్నాయి.

వారిని పార్టీలోకి తీసుకోవడానికి రాష్ట్ర పార్టీ నేతలు అందరూ కూడా తీవ్రంగా కష్టపడుతున్నాట్టు సమాచారం కొంతమంది కీలక నేతలు భారీ ఆఫర్లు కూడా ఇస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎవరిని తీసుకుంటారు ఏంటి ఇంకా స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో అసంతృప్తిగా ఎక్కువగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది నేతలు ఇప్పుడు సీరియస్ గా ఉన్నారని కాబట్టి వారందరినీ కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు తీసుకు  రావడానికి ఎక్కువగా కష్టపడుతుంది భారతీయ జనతా పార్టీ.

అయితే టీఆర్ఎస్ పార్టీకి ఎక్స్ అఫిషియో ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేదు. గానీ ఇప్పుడు మాత్రం టిఆర్ఎస్ పార్టీ గెలిచిన సరే  ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ నుంచి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే 70 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే మాత్రం కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభావం ఉంటుంది అనేది చూడాలి. ఇతర పార్టీల నేతలను ఎంత వరకు తమ పార్టీలోకి తీసుకుంటుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: