దాదాపుగా 15 రోజుల పాటు సందడిగా సాగిన ప్రచారానికి తెరపడి కీలక అంకానికి తెరలేచింది గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్దమైంది.అయితే ఈ ఎన్నికలు ఎప్పుడూ లేనంత రసవత్తరంగా మారాయని చెప్పవచ్చు.ఎందుకంటే తెలంగాణలో అంతా పట్టు లేని బి‌జే‌పి పార్టీ బలం పుంజుకోవడంతో టి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రదాన ప్రతిపక్షంగా మారింది.ఇంతకుముందు టి‌ఆర్‌ఎస్ కు ప్రదాన ప్రత్యర్ది పార్టీలుగా ఉన్న తెలుగుదేశం,కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో ఉనికిని నిలుపుకొనే పనిలో పడ్డాయని చెప్పవచ్చు.

ఈ అంశాలకు సంబందించి కాంగ్రెస్ ఎం‌పి రేవంత్ రెడ్డి పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు.గ్రేటర్ ఎన్నికల కోసం బి‌జే‌పి నాయకులు అంతా మంది ప్రచారానికి రావడం ఆశ్చర్యంగా వుందన్నారు.బి‌జే‌పి నేతలు హైదరబాద్ పేరు మారుస్తాం అనడం కరెక్ట్ కాదన్నారు.హైదరబాద్ ను అభివృద్ది చెయ్యకున్న ప్రచారం చేసుకోవచ్చని అన్నదమ్ములైన మోడి,అమిత్ షా లు నిరూపించారంటూ ఎద్దేవా చేశారు.

బి‌జే‌పి పార్టీ ముస్లింలను చులకనగా చూడటం మానెయ్యలని హెచ్చరించారు.ముస్లింల కోసం  కాంగ్రెస్ ప్రభుత్వం 2014 లో పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. టి‌ఆర్‌ఎస్,ఎంఐఎం పార్టీలు కలిసి కాంగ్రెస్ ను బలహీన పరచడం వల్లే బి‌జే‌పి ఎదిగిందన్నారు.తెలంగాణలో బి‌జే‌పి ఎదగడానికి ప్రదాన కారణం టి‌ఆర్‌ఎస్ పార్టీ కారణం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.    .

మరింత సమాచారం తెలుసుకోండి: