గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం ముగిసింది. చివరి రోజైన ఆదివారం అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముగించాయి. అయితే సోమవారం కొత్త పరిస్థితి తలెత్తింది. మందు, డబ్బు పంపిణీ ప్రారంభమైంది. ఇలా ఓ పార్టీ మద్యం బాటిళ్లు ప్రజలకు పంచి పెడుతుంటే మరో పార్టీ వాళ్లు అడ్డుకున్నారు. ఈ ఘటన నగరంలోని చైతన్యపురి కాలనీలో జరిగింది. ఇక్కడ అధికార టీఆర్ఎస్, బీజేపీ కార్యక్తల మధ్య గొడవ కారణంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందన కొందరు నేతలు ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తుండగా కొందరు బీజేపీ నేతలు దాన్ని చూశారు. అంతే వెంటనే రంగంలోకి దిగి టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన టీఆర్ఎస్ నేతలు బీజేపీ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ నేతలో ఒకరితో ఒకరు ఘర్షణకు దిగారు. దాంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణ చూసిన కొందరు పోలీసులకు ఫోన్ చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

రెెండు పార్టీల నేతలు ఘర్షణ పడటం చూసి, ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు రెండు పార్టీల వారినీ వెనక్కు పంపించడానికి చాలా కష్ట పడ్డారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయినట్లు సమాచారం. ఏది ఏమైనా ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ఇలాంటి సీన్లు సర్వ సాధారణం అయిపోయాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 ఇంకా ఒక్క ఓటు కూడా పడక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఓటింగ్ సమయంలో, ఆ తర్వాత కౌంటింగ్ సమయంలో పరిస్థితులు ఇంకెంత ఆందోళన కరంగా ఉంటాయో అని హెచ్చరించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండకపోతే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: