రాజదాని అమరావతిపై న్యాయవాది బండారు ఆదినారాయణ  హైకోర్టులో వాదనలు వినిపించారు. వేలది ఏకరాలు రైతుల దగ్గరనుండి ముందస్తుగా తీసుకుని అనేక ప్రభుత్వ భవనాలను నిర్మించి కంపెనీలకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలకు భారీగా కేటాయింపులు జరిపి, సి.ఆర్.డి.ఏ. రద్దు చట్టంలో నష్టపరిహారం అభివృద్ది ప్రణాళిక లేకుండా తెచ్చిన చట్టం చట్టవిరుద్దం, రాజ్యాంగ వ్యతిరేకం అని ఆయన పేర్కొన్నారు. శాసనమండలిలో సవివరమైన చర్చ చేయకుండా సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా తెచ్చిన అభివృద్ది వికేంద్రీకరణ చట్టం చెల్లదు అన్నారు.

ద్విసభ విదానం అమలులో ఉన్న ఏ.పి.లో శాసనమండలి అభిప్రాయాలు వమ్ముచేసి తెచ్చిన రెండు చట్టాలు చెల్లవు అన్నారు. రాజ్యాంగంలోని పలు అధికరణలను ఉటంకిస్తూ రాజదాని మార్పు రాష్ట్ర విభజన చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేశారు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజదానిగా హైదరాబాదును నిర్దేశించిన కేంద్రం ఇప్పుడు అమరావతి విషయంలో తమకు సంబందంలేదని చెప్పడం సరికాదు అన్నారు. రిపబ్లిక్ ఇండియాలో ఇంతపెద్ద ఎత్తున లాండ్ పూలింగ్ ద్వారా ప్రజలనుండి రాజదాని అభివృద్దికి భూసమీకరణ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు అన్నారు.

లాండ్ పూలింగ్ లో లోపాలు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగి ఉంటే, వాటిమీద చర్యలు తీసుకోవాలిగాని, కోట్లాది రూపాయలు వెచ్చించిన తరువాత రాజదాని మార్చడం సభబుకాదు అని ఆయన వాదించారు. చట్టం దీనికి అనుమతించదు అన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్దిక వెసులుబాటు లేదంటూ, 3 రాజదానులు చేయడమంటే, నిదులు ఎక్కడి నుంచి సమీకరిస్తారు అని నిలదీశారు. రాజ్యం తాను చేసిన వాగ్దానాన్ని విస్మరిస్తే ప్రజలకు ఎవరు భరోసా కల్పిస్తారు అని ప్రశ్నించారు. వేలాదిమంది రైతులు భవిష్యత్ పణంగాపెట్టిన అమరావతి రాజదానిని తరలించడం భావ్యమా..? అని ఆయన నిలదీశారు. ఒక కొత్త చట్టం తీసుకురావడం కోసం సీ.ఆర్.డి.ఏ. చట్టంలో లోపాలున్నాయని రద్దుచేయడం విచిత్రంగా ఉంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: