గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయినా సరే నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగలేదు అనే చెప్పాలి. రాజకీయంగా ఈ ఎన్నికలు చాలా కీలకంగా ఉన్న నేపధ్యంలో ప్రతీ పరిణామం కూడా ఆసక్తిగా ఉంది. ఎప్పుడు లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఆసక్తిగా ఉన్నాయి. ఈ ఎన్నికలలో కచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఓడించి మరోసారి తాము తిరుగులేని  శక్తి అనిపించుకోవాలని తెరాస పార్టీ భావిస్తుంది. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించడానికి బిజెపి నేతలు కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు.

ఎన్నికలు అయిన తర్వాత పరిణామాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి టి.ఆర్.యస్ నాయకులు ఎమ్మెల్సీ శ్రీ నివాస్ రెడ్డి, లిగల్ సెల్  భరత్ కుమార్ కీలక ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా  టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ మాట్లాడుతూ... ఓ టివి ఛానెల్ బీజేపీ ప్రచారకర్తగా మారింది. దీనిపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాం అని ఆయన  వెల్లడించారు. రేపు ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ సూచించింది అని ఆయన పేర్కొన్నారు.

ఇల్లీగల్ గా బీజేపీ ప్రచారం చేస్తోంది అన్నారు. ఒక పార్టీని టార్గెట్ గా చేసి కథనాలు ప్రసారం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. కొంతమందికి పైసలు ఇచ్చి మాట్లాడిస్తూ.. తిట్టిపిస్తున్నారు అని ఆయన అన్నారు. హద్దు పద్దు లేకుండా మాట్లాడుతున్నారు అని విమర్శించారు. బిజెపికి మాట్లాడే అర్హత లేదు అన్నారు. ఈ కథనాల వెనుక ఎవరు ఉన్నారో బయటకు వచ్చేలా చేయాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రయివేటు ఛానెల్ పై ఎస్ఈసి చర్యలు తీసుకోవాలన్నారు. మాయ మాటలు, మాయదారి పనులు, మోసం చేయడం బీజేపీకే తెలుసు అని ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: