టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ప్రజా వేదిక కూల్చారు అని ఆయన అన్నారు. ప్రజా వేదికను కూల్చడం ద్వారా ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడం కాదా..? అని నిలదీశారు. వరి రైతులకు హెక్టారుకు రూ. 30 వేలు.. హర్టీకల్చర్, ఆక్వా రైతులకు హెక్టారుకు రూ. 50 వేలు ఇవ్వాలి అని డిమాండ్ చేసారు. నాపై చర్యలు తీసుకుంటే తీసుకోనివ్వండి.. రీమూవ్ చేసేయండి.. ఎమ్మెల్యేలందర్నీ తీసేయండి అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

అధికారంలోకి వచ్చిన వైసీపీ అమలు చేయాల్సింది భారత రాజ్యాంగమే కానీ.. రాజా రెడ్డి రాజ్యాంగాన్ని కాదు అని ఆయన పేర్కొన్నారు. బూతులు మాట్లాడ్డకపోవడమే నా బలహీనత అనుకుంటే తప్పు.. అదే నా బలం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రైతుల విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఆయన స్పష్టం చేసారు. రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్ధిష్ట హామీ ఇచ్చేంత వరకు అసెంబ్లీలో పోరాడతాం అన్నారు. ఫేక్ ఫెలోస్ వచ్చి.. రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు. గాల్లో తిరుగుతూ.. గాలి మాటలు చెప్పే సీఎం జగన్ అని ఆయన విమర్శించారు.

జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు.. అలాగే ఇన్పూట్ సబ్సిడీని నాశనం చేస్తున్నారు అని ఆయన విమర్శలు చేసారు. ప్రిమీయం చెల్లించకుండా పంటల బీమా వ్యవస్థను నాశనం చేస్తున్నారు అని, ప్రిమీయం కట్టి ఉంటే.. బీమా వచ్చేది.. కానీ జగన్ చేతకాని తనం వల్ల రైతులు నష్టపోతున్నారు అన్నారు. సొంత బీమా పెడతామంటూ కబుర్లు చెబుతున్నారు అని, నా రాజకీయ అనుభవం అంత లేదు జగన్ వయస్సు.. నాకు చెబుతారా..? అని ఆయన నిలదీశారు. ఏ పూనకంలో ప్రజలు ఓటేశారో..? రాష్ట్రం ఇలా అయింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ప్రజల కోసం నా జీవితంలో ఏనాడూ పడనన్ని తిట్లు పడుతున్నాను అన్నారు. జీనోమ్ వ్యాలీకి ప్రధాని వస్తే ఎంతో సంతోషించా అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నా కోసం ఏనాడూ అభివృద్ధి చేసుకోలేదు.. ప్రజల కోసమే చేశాను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: