సోము వీర్రాజు ను కలిసిన అమరావతి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేసారు. భూములు ఇచ్చి‌బజారున పడిన‌ వైనం‌పై  కన్నీరు పెట్టిన రైతులు... అమరావతి రైతులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. రాజధాని ఇక్కడ పెట్టాలని మేము ఎప్పుడూ కోరలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రం నడిబొడ్డున రాజధాని అంటే.. సరే అన్నాం అన్నారు. ముప్పై వేల ఎకరాలు సేకరించినా.. మేము మాట్లాడలేదుఅని, అన్ని పార్టీలు అంగీకరించాయనే దైర్యంతోనే రైతులు అందరూ భూములను త్యాగం చేశారు అని చెప్పారు.

నేడు పాలకులే.. మా మీద పగ పట్టి సాధిస్తున్నారు అని ఆయన విమర్శించారు. మేము ఏమి తప్పు చేశామో, నేరం చేశామో మాకే అర్దం కావడంలేదు అని ఆయన పేర్కొన్నారు. దాదాపు యేడాది కాలంగా రోడ్డోక్కి రోధిస్తున్నా.. మా వేదన తీర్చే వారు కనిపించడం లేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆనాడు రాజధాని ఇక్కడే ఉంటుంది, అభివృద్ది చేస్తామని చెప్పారు అని, ప్రధాని హోదాలో మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని మారిస్తే.. ఇక ఎవరిని నమ్మాలి అని వారు ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్రం స్పందించాలి... అమరావతినే రాజధానిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి అని కోరారు.

రాజధాని మార్పు జరిగితే... వేల మందికి ఆత్మహత్యలే శరణ్యం అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుల ద్వారా.. మోడీ, అమిత్ షాలకు  దృష్టి తీసుకువెళ్లి మాకు న్యాయం చేయాలి అని కోరారు. సోము వీర్రాజు మాట్లాడుతూ రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు తమ భూములను త్యాగం చేశారు అన్నారు. రైతులకు అమరావతి ప్రాంతంలోనే 29వేల మందికి 64వేల   ఫ్లాట్లు కేటాయించాలి అని డిమాండ్ చేసారు. తొమ్మిదివేల ఎకరాల భూమిని అభివృద్ది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలనేది బీజేపీ కచ్చితమైన నిర్ణయం.. ఇందలో రెండో అభిప్రాయం లేదు అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికి యాభై సార్లు ఈ అంశాన్ని చెప్పినా... నా వాయిస్ ను కొన్ని మీడియాల్లో రాయరు, ప్రసారం చేయరు.. ఇది ఎపీలో దౌర్భాగ్యం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: