ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలైన మొదటి రోజే విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. చంద్రబాబుతో సహా పనేలేదు మందిని ఈ ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు  తమ్మినేని ప్రకటించారు. వింటర్ ని హీటెక్కిస్తూ సమావేశాలు వాడిగా వేడిగా ప్రారంభమయ్యాయి. పంట కోల్పోయిన రైతులని తక్షణమే పరిహారం చెల్లించి ఆదుకోవాల్సిందిగా తెలుగు దేశం సభ్యులు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారు. రైతుల పంటకు ప్రభుత్వం ఇన్సూరెన్సు చెల్లించలేదని...ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని వారు డిమాండు చేశారు. పంట నష్టానికి సంభందించిన చర్చలో సీఎం జగన్ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు ప్రభుత్వ తీరును ఎండగట్టారు.


ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడేందుకు సిద్దపడగా సీఎం అభ్యంతర పెట్టారు. ఓ సభ్యుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడమేటంటూ నిలదీశారు. తనని మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడంతో ఆగ్రహం చెందిన చంద్రబాబు స్పీకర్ పోడియం ఎదురుగా బైఠాయించారు. ఈ ఘటనపై జగన్ స్పందిస్తూ చంద్రబాబు రౌడీయిజం చూపిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. ఆయనకేధో అన్యాయం జరుగుతున్నాళ్ళు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని  చెప్తూ డిసెంబర్ నెలాఖరు నాటికి రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. చంద్రబాబు కావాలనే పోడియం ఎదుట బైటాయించారని విమర్శించారు.


జగన్  వ్యాఖ్యల్ని కూడా టీడీపీ తప్పు పట్టింది. చంద్రబాబుకు మద్దతుగా మరికొంతమంది టీడీపీ సభ్యులు కూడా బైఠాయించడంతో టీడీపీ సభ్యులని ఈ ఒక్కరోజుకు సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. సస్పెండైన సభ్యుల్లో చంద్రబాబు, అచ్చెమ్ నాయుడు, బాలవీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామోహనరావు, జోగేశ్వరరావు, సత్యప్రసాద్. మంతెన రామరాజు, పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్ సస్పెన్షన్ కి గురయ్యారు. వీరిని మార్షల్స్ బలవంతంగా బయటకి తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా టీడీపీ సభ్యులు అసెంబ్లీ ఆవరణలోనే ఆందోళనకి దిగారు. అసెంబ్లీకి వరికంకుల ప్రదర్శనతో  టీడీపీ సభ్యులు వచ్చారు. వ్యవస్థలను ధ్వంసం చేశారు.


రాష్ట్రం కట్టాల్సిన ఇన్సూరెన్సు ఎగ్గొట్టారు. రైతులను నమ్మించి మోసం చేశారు. ఇది మోసగాళ్ల పాలన. పక్కా 420 పాలన...అనే నినాదాలతో కూడిన ప్ల కార్డులను ప్రదర్శించారు. రైతులకు పంటనష్టాన్ని పరిహారంగా తక్షణమే చెల్లించాలంటూ నినాదాలు చేసారు. ఇన్సూరెన్సు ప్రీమియం చెలించలేదని...దాంతో రైతులను ఆడుకోవాల్సింది ప్రభుత్వమేనంటూ వారు డిమాండ్ చేశారు. తొలుత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన ప్రముఖులకు సభ నివాళి ఘటించింది.మాజీ రాష్ట్రపతి ప్రణబ్, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితరులకు అసెంబ్లీ నివాళి ఘటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: