ఎట్టకేలకు గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల సమయం మాత్రమే వుంది.గత పది రోజులుగా ఈ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు గల్లీ గల్లినా ప్రచారాలు నిర్వహిస్తూ హోరెత్తించాయి.పరస్పర ఆరోపణలతో ,ప్రకంపనలు రేపే ఘాటు వ్యాఖ్యలతో పోలిటికల్ హిటును తార స్థాయికి తీసుకెళ్ళాయి. ప్రచారంలో అన్నీ పార్టీలు కూడా అభివృద్ధి మాట కన్నా.. ప్రత్యర్థుల మధ్య ఆరోపణల యుద్ధమే ఎక్కువగా సాగింది. ఇవి స్థానిక ఎన్నికలే అయిన దేశం మెత్తం దృష్టి ఈ ఎన్నికలపై పడేలా ప్రచారాలు నిర్వహించాయి పార్టీలు.

 ఇదిలా వుంటే ఎంఐఎం-బీజేపీ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతటి దుమరాన్ని రేపయో తెలిసిందే. బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్ తాము గెలిస్తే పాత బస్తీలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామనడం,దానికి కౌంటర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాజీ ప్రధాని పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్స్‌ను కూల్చివేస్తామని అనడం పెను దుమారన్నే రేపాయి.ఇక బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై అసదుద్దీన్‌ ఒవైసీ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్య్వూలో పలు వ్యాఖ్యలు చేశారు.

పాత బస్తీలో రొహింగ్యాలు, పాకిస్తానీ ఓటర్లు, అక్రమ వలసదారులు ఉన్నారని వచ్చిన ఆరోపణలు అబద్దమన్నారు.పాతబస్తీ హైదరబాద్ లో భాగమే అని తెలిపారు. బి‌జే‌పి నేతలు పాతబస్తిని శత్రు దేశంలా భావిస్తున్నరన్నారు.ఈ ఎన్నికల్లో అన్నీ పార్టీలు కూడా తమనే టార్గెట్ చేస్తున్నాయని నేను లైలా లాంటి వాడినైతే మిగతా వారంతా మజ్నూలా నా వెంట పడుతున్నారు.’ అంటూ చమత్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: