గ్రేటర్ ఎన్నికల ప్రచారం పూర్తి అయినప్పటి నుండి రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటర్ల పైన దృష్టి పెట్టాయి.వాళ్ళను ఆకర్శించేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.మద్యాన్ని,డబ్బును ఎరగా వేసి ఓటర్లనుండి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు..

అయితే ఎన్నికల కనిషన్ మద్యం గాని, నగదు గాని , పంచినట్టు తెలిస్తే వారిమీద, ఆ పార్టీమీద చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించింది.ఈ నేపద్యంలో అభ్యర్ధులు డబ్బు పంపిణీకి కొత్త విధానాలు కనుక్కుంటున్నారు. కార్యకర్తలతో పంపిణీ చేస్తే పోలీసులు..ఇతర పార్టీల అభ్యర్ధుల నుంచి ఇబ్బందులు తలెత్తుతాయని ఊహించిన కార్యకర్తలు...

ఎవరికీ అనుమానం రాకుండా..చిన్న పిల్లల ద్వారా డబ్బు పంపిణీ చేస్తున్నారట. ఎల్ బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని గడ్డి అన్నారం డివిజన్ లో కొందరు కార్యకర్తలు చిన్నారులచే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ మీడియా కంటపడ్డారు. అయితే డబ్బు పంచిన వారు  ఏ పార్టీ వాళ్ళు అనే దానిపై స్పష్టత లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: