గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ‌కు మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలింది.అన్నీ రాజకీయ పార్టీలు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నా సమయం రానే వచ్చింది.డిసెంబర్ 1 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.అందుకు సంబందించిన అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్ధసారధి వెల్లడించారు.

ఈసారి గ్రేటర్‌ ఎన్నికల్లో ఈవీఎం పద్దతిలో కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సిబ్బంది డిసెంబర్ 1వ తేదీ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరగనుండగా అందుకుగాను 1,122 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు.అయితే ప్రదాన పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్న నేపద్యంలో బల్దియా పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. . 

మరింత సమాచారం తెలుసుకోండి: