ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...గ్రేటర్ హైదరాబాద్ లో గత 15 రోజుల నుంచి ఎన్నికల ప్రచారం చాలా సాఫీగా అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసింది. నిన్నటితో వివిధ రకాల పార్టీల ఎన్నికల ప్రచారాలు ముగిసాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్‌కు అంతా  సిద్ధమైంది. ఈసారి ఈ ఎన్నికలను బ్యాలెట్ విధానం ద్వారా నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఈవీఎం ద్వారా ఓటు వేస్తున్న ఓటర్లు బ్యాలెట్ పద్ధతిని మరచిపోయారనే  స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా.. కొత్తగా ఓటు హక్కు వచ్చిన      వాళ్ళు కూడా దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేటప్పుడు  అధికారులకు పోలింగ్‌ స్లిప్‌తో పాటు  21 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలి.


అనంతరం ఓటు వేయడానికి అనుమతి ఇస్తారు. ప్రిసైడింగ్‌ అధికారి వద్దకు వెళ్లి పోలింగ్‌ స్లిప్‌ చూపిస్తే.. ఆ క్రమసంఖ్య/ పేరు జాబితాలో ఉందా? లేదా? అనేది చూసి అక్కడ ఉండే వివిధ పార్టీల పోలింగ్‌ ఏజెంట్లకు వినబడేలా గట్టిగా చదువుతారు. వారు ఓకే చెప్పిన తర్వాత.. పక్కన ఉండే పోలింగ్‌ సిబ్బంది ఓటర్ ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా మార్క్‌ వేస్తారు.ఆ తర్వాత అక్కడ ఉండే మరో అధికారి ఓటరు సంతకం తీసుకొని బ్యాలెట్‌ పత్రాన్ని క్రమపద్ధతిలో మడిచి, దాంతో పాటు స్వస్తిక్‌ గుర్తు రబ్బర్‌ స్టాంప్‌ ఇస్తారు. ఆ బ్యాలెట్‌లో ఆ స్థానానికి సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వాటికి ఎదురుగా వారికి కేటాయించిన గుర్తులు ఉంటాయి.


బ్యాలెట్ పత్రం తీసుకున్న తర్వాత సూచించిన ప్రదేశానికి  వెళ్లి తాము ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గుర్తుపై సిరా ముద్ర వేసి, దాన్ని ఎన్నికల అధికారులు సూచించిన పద్ధతిలో మడిచి ప్రిసైడింగ్ అధికారి ఎదురుగా ఉండే బ్యాలెట్ బాక్సులో వేయాలి. అప్పుడు మీ ఓటు నమోదైనట్లు లెక్క. బ్యాలెట్ పత్రంపై అభ్యర్థికి సంబంధించిన గుర్తు ఉన్న బాక్సులో పైకికి, కిందకి జరగకుండా కరెక్టుగా గుర్తు ఉన్న గడిలో మాత్రమే సిరా ముద్ర పడేలా జాగ్రత్త పడాలి. నిర్దేశించిన  గీతలను దాటితే  ఓటును లెక్కించరు. చెల్లని ఓటుగా పరిగణిస్తారు.


ముద్ర వేసిన తరువాత  బ్యాలెట్‌ పేపర్‌ను తిరిగి అక్కడ ఉండే సిబ్బంది సూచించిన విధంగా క్రమ పద్ధతిలో మడత పెట్టాలి. లేకపోతే ఇంక్‌తో వేసిన స్వస్తిక్‌ ముద్ర మరో వైపు అంటుకొని  ఆ ఓటు చెల్లకుండా పోతాయి.బ్యాలెట్ పేపరుతో ఓటు వేసే విధానానికి సంబంధించి హైదరాబాద్, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర స్వచ్ఛంద సంస్థలు రూపొందించిన వీడియోలు కూడా ఉన్నాయి. వాటి ద్వారా మరింత తెలుసుకోవచ్చు. ఇవి ఓటు వేసే టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: