గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసింది. నేడు ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమం కొనసాగుతూ వస్తోంది. రేపటితో గ్రేటర్ ఓటర్ తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో కి చేరిపోతుంది. ఆ తర్వాత నాలుగు రోజులకు ఎవరి జాతకం ఏమిటో బయటకి వచ్చేస్తుంది. కానీ అప్పటి వరకు గ్రేటర్ లో పోటీ చేసిన అభ్యర్థులకు , వారిని పోటీలోకి దింపిన పార్టీలకు ఒకటే టెన్షన్ . గ్రేటర్ ఓటర్ తీర్పు ఎలా ఇచ్చాడో..? ఇదే రకమైన టెన్షన్ అన్ని పార్టీల లోను , పార్టీల తరపున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులలోనూ నెలకొంది. అన్ని పార్టీలు గ్రేటర్ ఎన్నికల ను ప్రతిష్టాత్మకంగా  తీసుకుని ప్రచారం నిర్వహించాయి. 




అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రేటర్ ఎన్నికలు జరిగాయి . రేపు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలవుతుంది. సాయంత్రం 6 వరకు కొనసాగుతుంది. గ్రేటర్ లో వచ్చే ఫలితం ఆధారంగా రానున్న రోజుల్లో తమ పార్టీల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో , నేతల్లో ఎక్కడలేని టెన్షన్ కనిపిస్తోంది.గతంలో ఎప్పుడూ జరగని విధంగా గ్రేటర్ ఎన్నికల హడావుడి ప్రస్తుతం నెలకొంది. ఎక్కువగా  గ్రేటర్ లో నెలకొన్న సమస్యలు తీర్చు తాము అనే హామీ ల కంటే, ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి.



 అప్పుడప్పుడు ఎన్నికల ప్రచారంలో తాము గ్రేటర్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామో, ఎంతగా పరితపించామో చెప్పుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇచ్చాయి. గ్రేటర్ పరిధిలోని నాయకులు మాత్రమే కాకుండా , గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నాయకుల వరకు అంత గ్రేటర్ లో వాలిపోయారు. ముఖ్యంగా బిజెపి టిఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని గ్రేటర్ లో పొలిటికల్ వాతావరణాన్ని హీట్ ఎక్కించారు. ఇక బిజెపి ఎంఐఎం టిఆర్ఎస్ పార్టీలు పూర్తిగా ఒకరిపై ఒకరు ఫోకస్ పెంచి విమర్శలు చేసుకోగా టీఆర్ఎస్ సైతం బిజెపిని తమ ప్రధాన శత్రువుగా భావించి ఆ పార్టీపై విమర్శల వర్షం కురిపించింది. ఇక కాంగ్రెస్ టిడిపి సిపిఎం సిపిఐ వంటి పార్టీల ప్రభావం పెద్దగా లేదని , ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే పోటి అనే విషయం అందరికీ క్లారిటీ వచ్చేయడంతో గ్రేటర్ ఓటర్ తీర్పుపై అన్ని పార్టీలు టెన్షన్ గా ఉన్నాయి. రేపు ఓటింగ్ ఎలా ఉండబోతుంది అనేది అందరికీ టెన్షన్ కలిగిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: