తెలంగాణ లో కేసీఆర్ పాలనా ఇప్పటివరకు ఒకలా ఉండగా ఇప్పటినుంచి ఒకలా అందబోతుందని తెలుస్తుంది.. ఇన్ని రోజులు కేసీఆర్ కి ఎదురులేదు.. ప్రతిపక్ష నాయకులూ కూడా అంతంత మాత్రంగా నే ఉండడంతో కేసీఆర్ ఆడిందే ఆట అయిపోయింది.. కానీ ఇప్పుడు బీజేపీ కేసీఆర్ కి సరైన ప్రత్యర్థిగా కనిపిస్తుంది.. ఇప్పటికే నాలుగు ఎంపీ సీట్లు గెలవగా ఇటీవలే దుబ్బాకలోనూ కేసీఆర్ కి పెద్ద షాక్ ఇచ్చింది..ఈ గెలుపులతో బీజేపీ కి కొత్త ఉత్సాహం వచ్చినట్లయ్యింది. ఎప్పటినుంచి తెలంగాణ లో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కి గ్రేటర్ ఎన్నికల ద్వారా ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది.. దానికి తోడు బండి సంజయ్ కూడా ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు..

ఒకవిధంగా చెప్పాలంటే బీజేపీ దూకుడు చూస్తుంటే బీజేపీ పార్టీనే గ్రేటర్ లో గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. కేంద్రం కూడా కేంద్రంలో తెలంగాణ బీజేపీ సభ్యలకు ప్రాధాన్యత ఇవ్వడంతో నేతల్లో మరింత ఉత్సాహం వచ్చినట్లు అయ్యింది.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన కిషన్ రెడ్డి కేంద్రమంత్రి గా చేసి ప్రజల్లో బీజేపీ పై నమ్మకం పెరిగేలా చేసింది కేంద్రం.కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ లో ఏ తప్పు జరిగినా అది కేంద్రం ఘనకార్యం అంటారు.. కేంద్రంలోని ప్రభుత్వం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది అంటారు. ఇటీవలే గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంలో కాంగ్రెస్, బీజేపీ లను కలిపి ఏకిపారేశారు.

అయితే దాన్ని తిప్పికొట్టడంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయ్యింది. ఆరు సంవత్సరాల తెలంగాణ చరిత్ర లో కేసీఆర్ ని ఎదురించే పార్టీ గా బీజేపీ అవతరించగా కేసీఆర్ ఇప్పుడు టీ ఆర్ ఎస్ ను ఎలా గెలుపు దిశగా పయనింపచేయాలనే డైలమా లో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు కేంద్రం ప్రవేశ పెట్టె పథకాలను కేసీఆర్ తన ఖాతాలో వేసుకుంటున్నారని కూడా ఆరోపణలు చేస్తూ కేసీఆర్ ఏమీ చేయలేదనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.. ఏదేమైనా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ ని భాగ్య నగరంగా మార్చే శక్తి ఉందని బీజేపీ నేతలు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: