గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మార్క్ చాలానే కనిపిస్తుంది. దుబ్బాక ఫలితం తమకు ఫేవర్ కు రావడంతో ఒక్కసారి గా తెలంగాణ లోబలమైన పార్టీ గా ఎదిగిన బీజేపీ పార్టీ ఇప్పుడు గ్రేటర్ లోనూ విజయ ఢంకా మోగించి మరింత బలపడాలని చూస్తుంది. అందుకోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది బీజేపీ. ఇప్పటికే తెలంగాణ లో కాంగ్రెస్ ను పక్కకు తోసి రెండో స్థానానికి ఎగబాకిన బీజేపీ పార్టీ ఇప్పుడు టీ ఆర్ ఎస్ ప్లేస్ కి ఎర్త్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి టీ ఆర్ ఎస్ ని గద్దె దింపి ఆ ప్లేస్ లో తమ పార్టీ ని నిలపాలన్నదే బీజేపీ ఆలోచన కాగా ఇప్పుడు గ్రేటర్ లోనూ అదే ఆశతో ముందుకు వెళుతుంది..

అయితే తెలంగాణ మాదిరిగానే బీజేపీ పార్టీ ఏపీ లో బలపడాలని చూస్తుంది.. ఇప్పటికే టీడీపీ పార్టీ ను సమూలంగా తుడిచిపెట్టుకుపోయేలా చేయడంలో వైసీపీ తో పాటు బీజేపీ కూడా ఓ చేయి వేసింది.. దాంతో బీజేపీ తప్ప వేరే ఏ పార్టీ కి ఏపీ లో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.. అయితే ఈ తిరుపతి ఎన్నికల్లో వైసీపీ కి కూడా ఝలక్ ఇవ్వాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుంది.. నిజానికి ఉప ఎన్నికల విషయంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే చాలా వరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తూ ఉంటుంది. విపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఉపఎన్నిక గెలవాలని అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా భావిస్తుంది.

రాజకీయంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తూ విపక్షాల పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని చూడటం సర్వసాధారణం. అయితే తిరుపతి ఉప ఎన్నికల విషయంలో వైసీపీ వైఖరి మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉంది అనే చెప్పాలి. గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీతో ఎంపీ స్థానాన్ని గెలిచినా వైకాపా ఈసారి మెజారిటీ పెంచుకోవటం పక్కన పడితే, విజయం సాధించటానికి తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అభిప్రాయాడుతున్నారు. అందుకు కారణం ఇక్కడ ప్రజల్లో వైసీపీ పట్ల కొంత వ్యతిరేకత ఉందట.. దానికి తోడు టీడీపీ కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో బీజేపీ ఓటర్లకు ప్రత్యామ్నాయ పార్టీ గా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: