జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తూ బీజేపీ తనకు వ్యతిరేకంగా ఉండే పార్టీ ల సంఖ్యను తగ్గించుకుందని తెలుస్తుంది.. పొత్తులో ఉన్నామన్న పేరు చెప్పి జనసేన ను ఏ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా తొక్కేసే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చేసిన బీజేపీ పార్టీ ప్రస్తుతం జరగబోయే తిరుపతి ఎన్నికల్లో సైతం పోటీ చేయనీయకూడదని చూస్తుంది.. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ త్యాగాన్ని గుర్తించకపోగా కొన్ని విమర్శనాత్మకంగా చురకలు అంటిస్తుంది బీజేపీ..

ఇటీవలే తెలంగాణ లో బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు జనసేన మద్దతు మేమేం అడగలేదు. పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ వచ్చి మాకు మద్దతు తెలిపాడు.. అయినా ప్రజలందరూ మావైపే ఉన్నారు. ఇలాంటి సమయంలో వేరే పార్టీ లీడర్ అండ మాకు అవసరం లేదు అన్నట్లు మాట్లాడారు..  నిజానికి ఈ టోన్ లో కాకుండా ధర్మపురి వేరే టోన్ చెప్పాడు. ఇది విన్న జనసేన అభిమానులు ఏవరైనా ఖచ్చితంగా హర్ట్ అవుతారు.

అయితే ఈ మాటలు ఆ నోటా ఈ నోటా పాకి పవన్ దాకా చేరాయి.. అరవింద్ ఈ మాటలు అనడం పట్ల పవన్ కొంత ఆశ్చర్యం వ్యక్తం చేశారట. తాను బీజేపీ కి మద్దతు పలికితే అయన ఇలా అందడం ఏంటని అనుకున్నారట.. ఓ వైపు ఏపీ లో బీజేపీ తో పొత్తు ఎప్పుడు ఊడుతుందో తెలీదు. అయినా తాను పోటీ నుంచి తప్పుకుని బీజేపీ కి మద్దతు పలికితే ఇలా అనడంపై అయన కొంత ఆగ్రహంగా ఉన్నారట.. నిజానికి పవన్ కి కేసీఆర్ కి మంచి సంబంధాలే ఉన్నాయి.. ఇలాంటి సమయంలో దాన్ని కాదనుకుని ఒకింత ఇష్టం లేకున్నా  బీజేపీ కి సపోర్ట్ చేసినా ఇలా తనపై విమర్శలు ఎంతవరకు సబబు అనేది పవన్ ప్రశ్న.. దీనిపై టీ బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: