ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం  పడుతున్నాయి ..ఇలా జరగడం నిజంగా శుభా పరిణామమే ...ఆంధ్రప్రదేశ్ లొ కరోనా రోగుల రికవరీ  రేట్ పెరగగా , మరణాల రేటు తగ్గుతుంది .. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 40  వేల  కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో  కేవలం 381  మందికి  వైరస్ సోకినట్లు నిర్దారణ అయ్యింది  .. దీనితో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఎనిమిది  లక్షల అరవై ఎనిమిది వేలకి చేరింది .. కరోనా వైరస్ తో ఈరోజు 4 గురు చనిపోగా కరోనా మరణాల సంఖ్య ఏడు వేలకి చేరువైంది .. ప్రస్తుతం రాష్ట్రంలో 7,840  మంది ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు


అయితే ఆంధ్రప్రదేశ్ లో కరోనా రికవరీ రేట్ బాగా పెరిగింది .. ఈరోజు కరోనా నుండి 934  మంది కోలుకున్నారు .. దీనితో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల యాభై మూడు వేలకి చేరింది .. కొన్ని రోజుల నుండి కరోనా కేసులు దారుణంగా పడిపోతున్నాయి .. కరోనా సెకండ్ వేవ్ అంటూ కేంద్రం భయపెట్టిన మన రెండు తెలుగు రాష్ట్రాలలో వైరస్  ప్రభావం  అంత ఏమి కనిపించడం లేదు .. రోజురోజుకు కరోనా కేసులు తక్కువగానే వస్తున్నాయి ..ఇవి ఇలాగే తగ్గుతూ ఉంటె కరోనా కేసులు రాని రాష్ట్రాలుగా మనం  నిలువవచ్చు ...

మరోపక్క దేశ వ్యాప్తంగా కూడా కరోనా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తుంది .. గడిచిన 24  గంటల్లో దేశం మొత్తం లో 38  వేల పాజిటివ్ కేసులు  మాత్రమే నమోదు అయ్యాయి .. దీంతో దేశం లో మొత్తం కరోనా  కేసుల సంఖ్య 94,31,691కి చేరింది.. ఇందులో 88,47,000 మంది కోలుకోగా ప్రస్తుతం దేశం లో 4,46,952  మంది చికిత్స పొందుతున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: