గ్రేటర్ ఎన్నికలు ఈసారి రణరంగాన్ని తలపిస్తున్నాయి.ఎప్పుడు లేనంతగా గ్రేటర్ ఎన్నికలపై అనూహ్యంగా దృష్టి పెట్టాయి రాజకీయ పార్టీలు.బి‌జే‌పి పార్టీ అయితే పార్టీ అధినేతలను అందరినీ హైదరబాద్ లో దింపి ఎన్నికల తరుపున ప్రచారం చేయించింది.ఇదిలా వుంటే రాజకీయ పార్టీలకు కొత్త సమస్య వచ్చి పడింది.అదేంటంటే ఓటింగ్ శాతం ఎంత నమోదవుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రముఖ రాజకీయ పార్టీలు. ఎందుకంటే హైదరబాద్ ప్రజలు ఓటు వెయ్యడానికి ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణం.

 హైదరాబాద్‌ ప్రజలు కొన్నేళ్లుగా పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ఉండకూడదని ఎన్నికల కమిషన్, జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలందరూ ఓటు వేయాలంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.అయితే ఓటు వేసే విషయంలో హైదరాబాదీలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదన్నది కాదనలేని వాస్తవం.ఎందుకంటే ఇప్పటివరకు గ్రేటర్‌లో ఓటింగ్‌ పర్సెంటేజ్‌ యాభై శాతం మించిన దాఖలాలు కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ఓటింగ్‌ నమోదయ్యే నగరం హైదరాబాద్‌ అంటేనే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

స్థానిక సంస్థల ఎన్నికలే కాదు., సాధారణ ఎన్నికల్లోనూ హైదరాబాదీల తీరు మారడం లేదు. 2014 ఎన్నికల్లో 53శాతం మంది కూడా ఓటు వేయలేదు. ఇక 2016 ఎన్నికల్లో కేవలం 45.27శాతం ఓట్లు మాత్రమే పోల్‌ అయ్యి అందరినీ షాక్ గురిచేసింది.అయితే ఈసారి మాత్రం ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఎందుకంటే ప్రదాన రాజకీయ పార్టీల మద్య పోటీ తీవ్రంగా ఉండడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఈసారి గ్రేటర్ ఎన్నికలు.అందువల్లే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: