ఎట్టకేలకు గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ప్రదాన ప్రత్యర్థులుగా నిలిచిన టి‌ఆర్‌ఎస్ ,బి‌జే‌పి,ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు.అయితే సోమవారం రాత్రి ఓ హోటల్ కు వచ్చిన బండి సంజయ్ ను టి‌ఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.దీంతో బండి సంజయ్ వర్గానికి టి‌ఆర్‌ఎస్ కార్యకర్తలకు కు మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఈ ఘర్షణ కు వ్యతిరేకంగా పలువురు బి‌జే‌పి నేతలు స్పందించారు.

టి‌ఆర్‌ఎస్ కార్యకర్తలు దాడులకు తెగబడడానికి ఎన్నికల కమిషన్ నిర్లక్షమే కారణం అని, ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా  నిరసిస్తూ దీక్ష చేయనున్నట్లు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. మంగళవారం  ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపడుతానని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. నగరంలోని నెక్లెస్‌రోడ్డులో సేదతీరేందుకు వచ్చిన బండి సంజయ్‌ను తెరాస కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో బండి సంజయ్ వాహనం అద్దాలు పగిలిపోయాయి.

పోలీసులు కలుగజేసుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. అయితే ఈ ఘటనపై  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. తెరాస అనైతిక విలువలను పాటిస్తోందని, కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా గెలుస్తుందనే భయంతోనే తెరాస నేతలు  అల్లర్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాసకు ఓటమి భయం పట్టుకుందని రాజాసింగ్‌ అన్నారు. భాజపా నేతలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని,రాజ్యాంగా విరుద్దామని మండిపడ్డారు. .

మరింత సమాచారం తెలుసుకోండి: