సెలబ్రిటీలు అంతా గ్రేటర్ లో ఓటింగ్ పెంచేందుకు మేము సైతం అంటూ రకరకాల మార్గాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో 50 శాతం లోపు ఓటింగ్ శాతం నమోదు కాగా, ఈసారి ఆ విధంగా జరగకుండా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సినీ తారలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవాలో స్పష్టంగా చెబుతూ, వీడియో సందేశాలను ఇస్తున్నారు . టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ,యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఓ వీడియోను రూపొందించారు.


మన నగరం మన భవిష్యత్తు అంటూ నాగార్జున జిహెచ్ఎంసి ఎన్నికలపై అందరినీ చైతన్యం చేస్తూ,  ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతూ.. వీడియో సందేశాన్ని విడుదల చేశారు. " మన నగరం ..మన రాజధాని... మన హైదరాబాద్... మన భవిష్యత్... మన పాలన ...మన ఓటు అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి ఓటు వేద్దాం మన శక్తిని చూపిద్దాం " అంటూ ఆ వీడియో సందేశం లో మెసేజ్ ఇచ్చాడు. అలాగే విజయ్ దేవరకొండ సైతం అదే వీడియోలో ఓటర్లకు సందేశాన్ని ఇచ్చారు.


 " అందరికీ నమస్కారం డిసెంబర్ 1న హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికలు ఉన్నాయి. నగర పౌరులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సామాజిక బాధ్యతతో వచ్చి ఓటు వేయండి " అంటూ రౌడీ హీరో విజయ్ సందేశం ఇచ్చారు. ఇక నటుడు ప్రకాష్ సైతం సోషల్ మీడియా ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రేటర్ ప్రజలను కోరారు .  ఇంకా అనేకమంది యాంకర్లు సైతం తమకు తోచిన విధంగా ఓటర్లను చైతన్యవంతం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: